HBD Jr NTR: బాలరాముడి నుంచి దేవరగా.. ఎన్టీఆర్ ఆస్తి ఎన్ని వందల కోట్లంటే? ఏకైక హీరోగా రికార్డు

అన్న నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. నటన, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ ఇలా ఏ విషయంలోనైనా తాతకు తగ్గ మనవడినని తారక్ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడాయన ఇమేజ్ టాలీవుడ్‌ను దాటి గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కీలక విషయాలు.. రికార్డులు, ఆస్తుల వివరాలను పరిశీలిస్తే..

13 ఏళ్ల వయసులో బాలనటుడిగా ఎంట్రీ

20-5-1983న నందమూరి హరికృష్ణ - శాలిని దంపతులకు జన్మించారు ఎన్టీఆర్. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న ఎన్టీఆర్.. దేశంలోని పలు ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. తాతగారి ఒడిలో నటనలో ఓనమాలు నేర్చుకున్న ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్రలో పెద్దాయనతో కలిసి నటించారు. ఆ తర్వాత 13 ఏళ్ల వయసులో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణంలో అద్భుతంగా నటించి ప్రశంసలు దక్కించుకున్నారు. తొలి సినిమాకే ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.

Jr NTR birthday special here s the War 2 Actor s net worth and Assets Details

హీరోగా నిన్నుచూడాలని తొలి సినిమా

అనంతరం సినిమాలకు బ్రేక్ చెప్పి చదువుపై దృష్టి సారించిన ఎన్టీఆర్ .. వెంట వెంటనే స్టూడెంట్ నెం 1, నిన్ను చూడాలని సినిమాలకు సైన్ చేశారు. అయితే స్టూడెంట్ నెం.1 నిర్మాణం ఆలస్యం కావడంతో నిన్నుచూడాలని తొలుత విడుదలై ఎన్టీఆర్ కెరీర్‌లో హీరో తొలి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ ఎన్టీఆర్ నటనకు మార్కులు పడ్డాయి. ఆ వెంటనే స్టూడెంట్ నెం.1, సింహాద్రి, ఆది సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ కావడంతో చిన్న వయసులోనే మాస్ ఫాలోయింగ్ అందుకున్నారు తారక్. అయితే ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో తారక్ నెంబర్ గేమ్‌లో వెనకబడ్డారు. తిరిగి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగతో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చారు ఎన్టీఆర్.

అదుర్స్‌తో కామెడీ

ఆ వెంటనే అదుర్స్, బృందావనం సినిమాలతో తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్‌‌తో ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయారు. అనంతరం నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర పార్ట్ 1 సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా, గ్లోబల్ స్టార్ ఇమేజ్‌లు ఎన్టీఆర్‌కు వచ్చి చేరాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా, హిందీలో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2లోనూ ఎన్టీఆర్ నటిస్తున్నారు.

ఎన్టీఆర్‌ ఓ ఆల్ రౌండర్

ఎన్టీఆర్‌లో మంచి సింగర్ కూడా ఉన్నారు. యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో చిత్రాలలో ఆయన పాట పాడారు. అలాగే కన్నడంలో దివంగత పునీత్ రాజ్ కుమార్ సినిమాలోనూ ఎన్టీఆర్ ఓ సాంగ్ పాడారు. దాదాపు తెలుగు సహా దాదాపు 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలరు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు దగ్గరి బంధువైన నార్నే లక్ష్మీప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు భార్గవ్ రామ్, అభయ్ రామ్ సంతానం. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీల లిస్ట్‌లో రెండు సార్లు నిలిచిన ఎన్టీఆర్‌కు జపాన్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏకైక తెలుగు హీరోగా రికార్డు ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా ఆడియో లాంచ్ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మందికి పైగా హాజరయ్యారని అంచనా.

కోట్లు కూడబెట్టిన ఎన్టీఆర్

సినిమాకు రూ.50 నుంచి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే తారక్.. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీగా ఆస్తులను కూడబెట్టారు. ఎన్టీఆర్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది. దాని విలువ రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలాగే బెంగళూరులో ఓ ఇల్లు, హైదరాబాద్ శంకరపల్లిలో ఓ ఫాంహౌస్‌ ఉంది. ఇవి కాకుండా పలు వ్యాపారాల్లోనూ, రియల్ ఎస్టేట్‌లోనూ తారక్ రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్.

9999 అంటే పిచ్చి

ఇక ఎన్టీఆర్‌ కార్లంటే ప్రాణం.. ఆయన ఏ వాహనం కొన్నా దానికి ఖచ్చితంగా 999, లేదా 9999 రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. తారక్ గ్యారేజీలో రూ.కోటిన్నర విలువైన పోర్సే 911, రూ.2.5 కోట్ల విలువై రేంజ్ రోవర్‌, కోటిన్నర విలువైన బెంజ్ 4 మెటిక్‌తో పాటు రూ.కోట్లు విలువైన వాచ్‌లు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఎన్టీఆర్ ఆస్తులు రూ.500 కోట్ల పైమాటే. ఆయన ఇలాగే మరిన్ని సూపర్‌హిట్ సినిమాల్లో నటించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఫిల్మీ బీట్ కోరుకుంటోంది

More from Filmibeat

Read more about: jr ntr war 2 lakshmi pranathi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X