మరో ఖరీదైన కారుపై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్.. ధర ఎంతంటే?
స్టార్ హీరోలు చాలా వరకు ఎంతో ఇష్టంగా కొన్న కార్లను ఎక్కువ రోజులు మెయింటైన్ చేయడానికి ఇష్టపడరు. మహా అయితే రెండు మూడేళ్లు. ఆ తరువాత మార్కెట్ లోకి కొత్త కారు వచ్చింది అంటే వెంటనే దానిపైనే మనసు మల్లుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా దాదాపు అదే తరహాలో కార్లను చేంజ్ చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ కు కార్స్ అంటే అమితమైన ఇష్టమని అందరికి తెలిసిందే. ఇక రీసెంట్ గా తనకు ఎంతో ఇష్టమైన కారును విదేశాల నుంచి దింపుతున్నాడు.

ఎంతో కష్టపడి పైకొచ్చిన తారక్
ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ టీనేజ్ వయసు వరకు కూడా హైదరాబాద్ ఆర్టీసీ బస్సులల్లో కూడా తిరిగాడు. అమ్మతో ఒక్కడే ఉంటూ ఎన్నో ఒడిదుడుకులను ఎడిర్కొన్నాడు. ఇక ఫైనల్ గా హీరోగా క్లిక్కయిన తరువాత నందమూరి ఫ్యామిలీలో అత్యదిక పారితోషికం అందుకుంటున్న హీరోగా క్రేజ్ అందుకున్నాడు.

అత్యదిక రెమ్యునరేషన్
ప్రస్తుతం RRR సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ 25కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. తారక్ కెరీర్ లో ఇదే అత్యదిక పారితోషికం. ఇక ఈ హీరోకు కార్లంటే అమితమైన ఆసక్తి. మార్కెట్ లోకి కొత్త బ్రాండెడ్ కారు వచ్చింది అంటే వెంటనే ఆరా తీస్తాడు. రెగ్యులర్ కార్లను వాడకుండా ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటాడు.

ఇటలీ నుంచి రాబోతున్న మొదటి కారు
అయితే గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ కన్ను ఒక కారుపై పడింది. ఇటలీ నుండి మొట్టమొదటి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) లంబోర్ఘిని కారును ఎన్‌టిఆర్ ఆర్డర్ చేసినట్లు సమాచారం. దీని విలువ భారత కరెన్సీలో రూ5కోట్లు. ఉంటుందట. ఇప్పటికే తారక్ వద్ద ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరొకటి చేరబోతున్నట్లు సమాచారం.

వరుసగా మూడు సినిమాలు
ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా అక్టోబర్ 13న రానుంది. ఇక ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











