స్టార్ ప్రొడ్యూసర్ చేతుల్లో పడిన ఎన్టీఆర్ బావమరిది.. అలాంటి స్టైల్లో న్యూ మూవీ!
నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన తమ సత్తా చాటుతున్నారు. నటసార్వభౌమ ఎన్టీఆర్ ముందుగా సినీ రంగ ప్రవేశం చేస్తే తర్వాత ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా రాణించారు. ఆ తర్వాత తరంలో కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, తారక రత్న హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే అనూహ్యంగా తారకరత్న కన్నుమూసిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.
తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడని, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, భార్య సోదరుడు నార్నే నితిన్ హీరోగా లాంచ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఒక సినిమా ద్వారా లాంచ్ అయ్యేందుకు ప్రయత్నించాడు. నార్నే నితిన్ డెబ్యూ మూవీకి 'శ్రీ శ్రీ శ్రీ రాజా వారు' అనే టైటిల్ ఖరారు చేసి 'శ్రీ వేదాక్షర మూవీస్' బ్యానర్‌పై రామారావు చింతపల్లి సహా ఎమ్మెస్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు గతంలో ప్రకటన వచ్చింది.

అయితే ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందని ఎప్పుడూ మొదలవుతుందో తెలియని నేపథ్యంలో ఎన్టీఆర్ బావమరిది అయోమయంలో పడిన క్రమంలో ఎన్టీఆర్ కు వీరాభిమానిగా చెప్పుకునే నాగవంశీ రంగంలోకి దిగినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. తన పెదనాన్న హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూనే స్వయంగా సితార ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఒక కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించి అనేక సూపర్ హిట్లు నిర్మిస్తూ వస్తున్నాడు నాగ వంశీ.
ఇక నార్నే నితిన్తో ఒక త్రీ ఇడియట్స్ లాంటి యూత్ ఫుల్ కాలేజ్ సబ్జెక్ట్ ని చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని ఈ మేరకు డైరెక్టర్ ఫిక్స్ అయ్యారని త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తారని ఆయన అభిమానులుగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నామని ప్రకటించి నాగ వంశీ ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని అనే విషయాన్ని బయట పెట్టాడు. ఇప్పుడు ఆయన బావమరిదితో సినిమా సెట్ చేసుకున్నాడు అన్నమాట.


Click it and Unblock the Notifications











