Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరోగా రాబోతున్న ఎన్టీఆర్ బావమరిది.. సీనియర్ దర్శకుడి సీక్వెల్ మూవీలో లక్కీ ఛాన్స్
నందమూరి ఫ్యామిలిలో ప్రస్తుతం అత్యదిక మార్కెట్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. నందమూరి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంత టాలెంట్ తోనే అవకాశాలు అందుకున్న తారక్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోస్ లో ఒకడిగా క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక చాలా రోజుల తరువాత ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరొక వ్యక్తి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. అందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా..
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్ తోనే చాలా మంది యువకులు వెండితెరకు పరిచయం అవుతున్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా టాలెంట్ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టమని కొంతమంది నట వారసుల కెరీర్లను కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సపోర్ట్ తో వస్తున్నప్పటికీ కొత్త కుర్రాడు హార్డ్ వర్క్ తో టాలెంట్ ను నిరూపించుకోవాలని రెడీ అవుతున్నాడట.
సిద్ధమైన ఎన్టీఆర్ బావమరిది
ఆ యువకుడు మరెవరో కాదు. జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నె నితిన్ చంద్ర. అంటే ఎన్టీఆర్ బావమరిది. నితిన్ తండ్రి నార్నె శ్రీనివాసరావు బిజినెస్ మెన్. ప్రస్తుతం ఆయన రాజకీయంగా వైసీపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా కాలం నుంచి నార్నె నితిన్ టాలీవుడ్ ఎంట్రీపై రూమర్స్ వస్తున్నాయి.
ఎన్టీఆర్ సలహాతోనే
నార్నె నితిన్ హీరోగా రెండు సినిమాలతో బిజీగా మారోబోతున్నట్లు అప్పట్లో రూమర్స్ బాగానే వచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ సలహాతోనే ఒక యువ దర్శకుడు చెప్పిన కథ కూడా ఫైనల్ అయినట్లు టాక్ వచ్చింది. ఇక గత ఏడాది నుంచి యాక్టింగ్ లో స్పెషల్ గా శిక్షణ తీసుకుంటున్న నితిన్ ఇటీవల ఒక సీనియర్ దర్శకుడి ఆడిషన్స్ కు వెళ్లినట్లు సమాచారం.
తేజ దర్శకత్వంలో..
ఆ సీనియర్ దర్శకుడు మరెవరో కాదు తేజ. 20 ఏళ్ళ క్రితం ఉదయ్ కిరణ్, నితిన్ వంటి యువ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసి బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చిన తేజ ఇప్పుడు నార్నె నితిన్ కెరీర్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. స్క్రిప్ట్ అయితే మొత్తం రెడీ అయినట్లు టాక్ వస్తోంది.
చిత్రం సీక్వెల్ లో హీరోగా
చిత్రం సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న తేజ నెక్స్ట్ ఆ సినిమా తరహాలోనే చిత్రం 1.1ను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి. అయితే హీరోగా ఎన్టీఆర్ బావమరిది, నితిన్ ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది. తేజ ప్రస్తుతం వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తిగా కొత్తవారితో తెరకెక్కుతోంది. దాదాపు 40మందిని ఆడిషన్స్ నిర్వహించి సెలెక్ట్ చేసినట్లు టాక్.