టెన్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్.. దేవర తర్వాత యంగ్ టైగర్ ఆ దర్శకులతోనేనా?
మళ్ళీ చాలా కాలం తర్వాత పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ తో రాబోతున్న సినిమా ఏదైనా ఉంది అంటే ఆ సినిమా దర్శకుడు కొరటాల శివ అలాగే మ్యాన్ మాసెస్ హీరో ఎన్టీఆర్ నటించిన బిగ్ ప్రాజెక్ట్ చిత్రం "దేవర" అనే చెప్పాలి. గత జూన్ లో ప్రభాస్ నటించిన "కల్కి 2898 ఎడి" తర్వాత తెలుగు నుంచి అలాగే సౌత్ నుంచి కూడా మళ్ళీ ఆ రేంజ్ బజ్ లో ఉన్న సినిమా అయితే రాలేదు.
మధ్యలో వచ్చిన "సరిపోదా శనివారం" అనే సినిమా ఒక్క తెలుగులో తప్పితే మిగతా ఏ భాషలో కూడా పెద్దగా రాణించింది లేదు. సో ఈ సినిమా కూడా కాకుండా అయితే పాన్ ఇండియా లెవెల్లో మంచి బజ్ లో వస్తున్నా సినిమా మాత్రం దేవరనే.. కాగా ఇపుడు ఎన్టీఆర్ సహా చిత్ర ప్రధాన బృందం అంతా కూడా పాన్ ఇండియా భాషల్లో ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు.

ఇలా ఇటీవల తమిళ్ లో మంచి ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ అక్కడ విలేఖరులకు సమాధానాలు ఇచ్చాడు. అయితే అక్కడ చేసిన ఓ కామెంట్ మాత్రం చర్చనీయంగా మారింది. తాను తమిళ్ ఎప్పుడు సినిమా చేస్తారు అనే ప్రశ్నపై దర్శకుడు వెట్రిమారన్ తో సినిమా చేయాలని అడుగుతున్నాను అని మీరైనా ఆయనకి చెప్పండి, తమిళ్ లో డైరెక్ట్ గా ఆ సినిమా చేసి తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేద్దాం అంటూ కామెంట్స్ చేసాడు.
అయితే తారక్ చేసిన ఈ కామెంట్స్ అభిమానుల్లో కొంచెం ఎబ్బెట్టుగా మారాయి. ఒకప్పుడు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇంత స్టార్డం ఉన్న ఎన్టీఆర్ లాంటి నటుడు ఇంకా తనతో ఈ సినిమా చేయాలని ఇలా ఓపెన్ గా అడగడం అనేది తనని చిన్న చూపు చేసేలా చేస్తుంది. గతంలో కూడా రాజమౌళితో సినిమా కోసం సురేందర్ రెడ్డితో అలాగే ఇటీవల ప్రశాంత్ నీల్ తో భారీ సినిమాలు కూడా ఎన్టీఆర్ సైడ్ నుంచే అప్రోచ్ వెళ్లడం అనేది తనపై మరింత నెగిటివ్ తీసుకొస్తుంది.

దీనితో అప్పట్లో అంటే ఓకే అనుకోవచ్చు కానీ ఇప్పటికీ కూడా ఇలానే కామెంట్స్ ఎన్టీఆర్ చేయడం అనేది తన పరిపక్వతా లోపాన్ని చూపిస్తుంది అని చెప్పక తప్పదు. దీనితో తమిళ ప్రెస్ ముందు సినిమా కోసం ఇలా అడుగుతూ ఎన్టీఆర్ పరువు తీస్తున్నాడని కొందరు అంటున్నారు.
అలాగే ఇదే కాకుండా ఇటీవల దేవర ప్రమోషన్స్ లో కూడా బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ లు మాట్లాడుతుంటే మధ్యలో ఎన్టీఆర్ కలుగజేసుకొని వారిని మాట్లాడనివ్వకుండా చేయడం కూడా ఎన్టీఆర్ మెచ్యూరిటీ ఎలా ఉందో చూపిస్తుంది. ఇలాంటి వాటి మూలాన సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై మరిన్ని ట్రోల్స్ పడుతున్నాయి. మరి దీనిపై తారక్ ఇప్పటికైనా తన విషయంలో ఒక రియాలిటీకి వచ్చి ప్రెస్ మీట్స్ లాంటి వాటిలో అలోచించి మాట్లాడితే బెటర్ అని చాలా మంది అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











