దేవర రూమర్లపై ఎన్టీఆర్ మాస్ వార్నింగ్.. ఆ వ్యక్తి ఎవరో తెలుసా?

చాలా కాలం తర్వాత తెలుగు సినిమా నుంచి వచ్చి భారీ వసూళ్లతో అదరగొడుతున్న భారీ చిత్రం "దేవర" అని చెప్పాల్సిందే. కాగా హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి కూడా ఎన్నో ఏళ్ళు తర్వాత వచ్చిన సోలో సినిమా కూడా ఇదే. దీనితో రాత్రి 1 గంట నుంచే షోలు పడిపోయి కొంచెం టాక్ అటు ఇటుగా వచ్చినప్పటికీ సెన్సేషనల్ వసూళ్లు అందుకొని దుమ్ము లేపింది.

కాగా ఈ సినిమా రిలీజ్ కి ముందు పలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సినిమాకి ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా డిజప్పాయింట్ కావడం ఇంకా పలు అంశాల్లో దేవర పలు కాంట్రవర్సీలని ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏదైనా నెగిటివ్ పోస్ట్ కనిపించినా టీం నుంచి రియాక్షన్ ఉండేది.

jr ntr confused mass warning to his fans on devara producer

కాగా ఇప్పుడు దేవర సక్సెస్ ఈవెంట్ కూడా పెద్దగా హడావుడి లేకుండా ముగిసిపోయింది. కానీ ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఇచ్చిన మాస్ స్పీచ్ లో కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ట్రిగ్గర్ అవుతున్నాయి. కాగా తాను చెప్పిన మాటల్లో ఎవరు ఏమనుకున్నా సరే తమకి హరి ఉన్నాడు అని, హరి కనిపించకుండా నాకు కానీ అన్న కళ్యాణ్ రామ్ కి ఎన్టీఆర్ ఆర్ట్స్ విషయంలో కానీ ఎంతో అండగా ఉన్నాడని అతని విషయంలో మాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా తారక్ తెలిపాడు.

అంతే కాకుండా తనని సరిగ్గా అర్ధం చేసుకోరు ఎవరేమన్నా, ఎవరేం అన్నా ఎవరేం అనుకున్నా నాకు అన్న కళ్యాణ్ రామ్ ఇద్దరికీ స్ట్రెంగ్త్ హరినే ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఇది ఎవరైనా జీర్ణించుకున్నా పర్వాలేదు జీర్ణించుకోకపోయినా పర్వాలేదు అంటూ ఓపెన్ గా తారక్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే అసలు ఈ హరి ఎవరు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.

తారక్ ఎవరి కోసం ఇంత ఎమోషనల్ చెబుతున్నాడని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. అయితే అసలు ఈ హరి ఎవరంటే కళ్యాణ్ రామ్ కి స్వయానా బావమరిది కాగా అతని విషయంలో ఎన్టీఆర్ ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాడో అన్నది ఇపుడు వినిపిస్తుంది. కాగా మొన్న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హరి వల్లే క్యాన్సిల్ అయ్యింది అని ఎన్టీఆర్ కి తన ఫ్యాన్స్ కి మధ్యలో వచ్చేలా చేసారని ఫ్యాన్స్ కొందరు అనుకుంటున్నారు.

jr ntr confused mass warning to his fans on devara producer

దీనితో ఆ కొందరు కోసమే ఎన్టీఆర్ ఇలా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వారు హరి విషయంలో జాగ్రత్తగా ప్రవర్తించాలి అన్నట్టుగా తారక్ వార్న్ చేసాడని కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో వారికే తెలియాలి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇంకొందరు దేవర విషయంలో హరి తమ ఎమోషన్స్ ని బాగా హర్ట్ చేసారని అభిమానులని తమ అభిమానాన్ని ఎప్పుడు గ్రాంటెడ్ గా తీసుకోకూడదు అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: devara kalyan ram jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X