ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే వీడియో ఇది.. అక్కడ యంగ్ టైగర్ క్రేజ్ మామూలుగా లేదుగా.!

By Manoj Kumar P

యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, సింగింగ్... ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ టాలీవుడ్ ఆల్‌రౌండర్‌గా పేరొందాడు జూనియర్ ఎన్టీఆర్. బడా ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినా... అద్భుతమైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక, ఈ మధ్య సూపర్ ఫామ్‌లో ఉన్న తారక్... త్వరలో మరిన్ని భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలాఉండగా.. అతడి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే ఓ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం దానిపై మీరూ ఓ లుక్కేయండి.!

Recommended Video

#HappyBirthDayNTR Hashtag India Wide Top Trending With 21 Million Tweets, Creates Record
డబుల్ హ్యాట్రిక్‌కు చేరువైన ఎన్టీఆర్

డబుల్ హ్యాట్రిక్‌కు చేరువైన ఎన్టీఆర్

ఒకదాని తర్వాత ఒకటి ఇలా పరాజయాలు ఎదురవుతున్న సమయంలో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్'తో హిట్ ట్రాక్ ఎక్కాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అక్కడి నుంచి అతడు వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ హిట్లను అందుకుని డబుల్ హ్యాట్రిక్‌కు చేరవయ్యాడు.

భారీ మల్టీస్టారర్‌లో రియల్ హీరోగా

భారీ మల్టీస్టారర్‌లో రియల్ హీరోగా

వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే అతడు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రాబోతున్న ఈ మూవీలో అతడు పోరాట యోధుడు కొమరం భీంగా, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

సాహసాలు చేస్తున్న యంగ్ టైగర్

సాహసాలు చేస్తున్న యంగ్ టైగర్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న RRR మూవీ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. ఇప్పటికే బాడీ ఫిట్‌నెస్ కోసం నిత్యం జిమ్‌లో గడుపుతున్నాడీ నందమూరి హీరో. ఇక సినిమా కోసం అన్ని భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనున్నాడు. అంతేకాదు, ఇందులో ఇంట్రడక్షన్ సీన్ కోసం పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

తొలిసారి పొలిటికల్ లీడర్‌గా తారక్

తొలిసారి పొలిటికల్ లీడర్‌గా తారక్

RRR షూటింగ్ జరుగుతుండగానే... ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కూడా ప్రకటించాడు. గతంలో తనకు ‘అరవింద సమేత' వంటి సూపర్ హిట్‌ను అందించిన త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకుడు. కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో తారక్ పొలిటికల్ లీడర్‌గా కనిపిస్తాడని టాక్.

మిస్సైల్‌గా మారుతున్న జూనియర్

మిస్సైల్‌గా మారుతున్న జూనియర్

త్రివిక్రమ్‌తో సినిమా చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ ప్రాజెక్టు చేయబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమాకు ‘మిస్సైల్' లేదా ‘న్యూక్లియర్' అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారని ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే వీడియో

వరుస విజయాలు అందుకుంటూ టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఎదుగుతున్నాడు నందమూరి హీరో ఎన్టీఆర్. అతడి క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జపాన్‌కు చెందిన ఓ జంట.. సింహాద్రి సినిమాలోని చీమ చీమ పాటకు స్టెప్పులేసింది. ఇందులో డ్యాన్స్, డ్రెస్ మొత్తం హీరోహీరోయిన్లులా ఉండడం విశేషం.

యంగ్ టైగర్ క్రేజ్ మామూలుగా లేదుగా.!

యంగ్ టైగర్ క్రేజ్ మామూలుగా లేదుగా.!

తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. తెలుగు రాష్ట్రాల్లో అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాగే, కర్నాటక, తమిళనాడుతో పాటు కేరళలోనూ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంది. విదేశాల విషయానికి వస్తే జపాన్‌లో ఎన్టీఆర్ సినిమాలకు మాంచి స్పందన వస్తుంటుంది. ఈ విషయం ఇప్పుడు మరోసారి నిరూపణ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X