దేవర మూవీని వెంటాడుతున్న లీకులు.. ఎన్టీఆర్ లుక్‌పై సోషల్ మీడియాలో రచ్చ!
ఇండియన్ సినిమాని వరల్డ్ సినిమా గ్రాఫ్ దగ్గర షేప్ అవుట్ చేసిన దర్శకుల్లో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమోళి ముందు వరుసలో ఉంటే తనతో పాటుగా గ్లోబల్ లెవెల్ భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోస్ కూడా ఉన్నారు. కాగా ఈ హీరోస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. కాగా ఎన్టీఆర్ కి రాజమౌళితో చేసిన గ్లోబుల హిట్ ఆర్ ఆర్ ఆర్ తో భారీ ఫేమ్ పాన్ వరల్డ్ లెవెల్లో వచ్చింది.
కాగా ఈ సినిమా సక్సెస్ తర్వాత తారక్ దర్శకుడు కొరటాల శివతో "దేవర" అనే మాస్ ప్రాజెక్ట్ తో రాబోతుండగా ఈ సినిమా కోసం ఇప్పుడు అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మొదట్లో సినిమాపై మరీ అంత అంచనాలు లేవు కానీ ఒక్కసారి ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చిన తర్వాత నుంచి తారక్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తుండగా ఈ రెండిట్లో కూడా ఎన్టీఆర్ మాస్ మరో లెవెల్లో చూపిస్తాడు ని అర్ధం అయ్యింది. కానీ ఈ సినిమా సంబంధించి లీకులు కూడా ఒకింత ఎక్కువే బయటకి వచ్చాయి. కానీ ఏ సినిమా లీక్స్ అయినా బయటకి వస్తే కొంచెం ఎగ్జైట్మెంట్ ని బిల్డప్ చేస్తాయి కానీ దేవర విషయంలో మాత్రం రివర్స్ లో జరుగుతుంది అని చెప్పాలి.
ఎగ్జైట్మెంట్ అటుంచితే లేటెస్ట్ లీక్ చూసి ట్రోల్స్ ఎక్కువ పడుతున్నాయి. తాజాగా ఓ పిక్ సినిమా నుంచి లీక్ కాగా ఇందులో మంచి డాషింగ్ గా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. కానీ ఈ పిక్ చూస్తే ఎవరికైనా మరో హీరో గుర్తు రాక మానడు. అందులో ఎన్టీఆర్ డ్రెస్సింగ్ చూస్తే హాఫ్ హ్యాండ్ బ్లాక్ లేదా బ్రౌన్ రంగు షర్ట్ లో కనిపిస్తున్నాడు.
కాగా అచ్చు ఇదే లుక్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ "సలార్" సెకండాఫ్ మొత్తంలో కనిపిస్తుంది. దీనితో ప్రభాస్ ని చూసి ఎన్టీఆర్ ఏదో ట్రై చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్స్ పడుతున్నాయి. గతంలో కూడా కొన్ని సినిమాలు చూసి ఎన్టీఆర్ ఇలానే ట్రై చేసాడు అంటూ కూడా కొందరు హీరోల ఫ్యాన్స్ అంటున్నారు.
ఇలా దేవర లీక్ తో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరకు ఎగ్జైట్ అవ్వోచ్చేమో కానీ సలార్ లుక్ చూసిన వారికి మాత్రం ఇది కాపీ లాగానే అనిపిస్తుంది. కాగా ఈ భారీ చిత్రాన్ని ఈ సెప్టెంబర్ 27కి మేకర్స్ పాన్ ఇండియా రిలీజ్ గా షెడ్యూల్ చేయగా ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ టాలీవుడ్ లో పరిచయం అవుతుండగా తనతో పాటుగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా తెలుగు సినిమాలో ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే ఈ సినిమాకి సంగీతం అనిరుద్ అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











