Devara: దేవర సినిమాలో మరో పవర్ఫుల్ క్యారెక్టర్.. ఆ భాషలో హైలెట్ అయ్యేలా కొరటాల ప్లాన్
ఈ మధ్యకాలంలో మలయాళీ స్టార్స్ టాలీవుడ్ చిత్రాలలో ఎక్కువగా భాగం అవుతున్నారు. మోహన్ లాల్ జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ తర్వాత మెయిన్ లీడ్ గా చేశారు. ఆ తరువాత కూడా మనమంతా అనే చిత్రంలో నటించారు. ఇక దుల్కర్ సల్మాన్ సీతారామం, మహానటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిపోయారు. యాత్ర మూవీతో మమ్ముట్టి తెలుగులో హిట్ కొట్టారు. రీసెంట్ గా ఏజెంట్ సినిమాలో నటించారు.
అలాగే ఫాహాద్ ఫాజిల్ పుష్ప సిరీస్ లో విలన్ గా కనిపిస్తున్నారు. మరికొంత మంది స్టార్స్ కూడా తెలుగులో నటించారు. రీసెంట్ గా దసరా చిత్రంతో షైన్ టామ్ చాకో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఈ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా నటించారు. ఈ సినిమా సక్సెస్ తో టామ్ చాకోకి తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర సినిమాలో విలన్ పాత్ర కోసం ఎంపిక అయినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా దృవీకరించలేదు. అయితే టామ్ చాకో తన ఇన్ స్టాగ్రామ్ స్టొరీలో ఫ్యాన్ మేడ్ పోస్టర్ ని స్టేటస్ గా పెట్టుకున్నారు. దీనిని బట్టి అతను దేవర చిత్రంలో నటిస్తున్నాడు అనేది కన్ఫర్మ్ అయ్యింది. మొత్తానికి ఈ టాలెంటెడ్ దసరాతో టాలీవుడ్ దర్శకుల దృష్టిని తన వైపుకి తిప్పుకున్నాడు. దీంతో వెంటనే పాన్ ఇండియా చిత్రం దేవర కోసం కొరటాల ఎంపిక చేశారు.
ఇక దేవర మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రాన్ని నవంబర్ నాటికి ఫినిష్ చేయాలని తారక్ అనుకుంటున్నారు. జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం మీద ఇండియన్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇలాంటి మూవీలో టామ్ చాకో లాంటి టాలెంటెడ్ యాక్టర్ భాగం కావడం నిజంగా విశేషం అని చెప్పాలి. ఇప్పటికే హీరోగా, విలన్ గా టామ్ చాకో మలయాళీ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకున్నారు. రీసెంట్ గా తెలుగులో డబ్ అయిన 2018 సినిమాలో కూడా ఈ నటుడు కీలక పాత్రలో కనిపించాడు. దేవరతో పాటు మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ లో కూడా టామ్ చాకో విలన్ గా ఖరారు అయినట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











