తాత గారిపై జూనియర్ ఎన్టీఆర్‌కి కోపం వచ్చిన సందర్భం.. మోసం చేసారని..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉండవచ్చు. కానీ ఈ స్థాయికి చేరుకోవడానికి తారక్ ఎన్ని బాధలను దాటి వచ్చాడో ఎవరికి పెద్దగా తెలియదు. నందమూరి వంశంలో సీనియర్ ఎన్టీఆర్ తరహాలో జనాల్లో క్రేజ్ అందుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఒకానొక సందర్భంలో తన తాత పై కోపగించుకున్నారట. కానీ అప్పటికే ఆయన ప్రాణాలతో లేరు. ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన చిన్ననాటి విషయాల గురించి ఈ విధంగా వివరణ ఇచ్చాడు.

Recommended Video

Jr.NTR Revealed His Childhood Emotional Incidents With Seniour NTR
తాత గారితో మొదటిసారి..

తాత గారితో మొదటిసారి..

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి మొదట్లో దూరంగా ఉండేవారని అందరికి తెలిసిన విషయమే. తల్లితోనే ఉంటూ తన నటనపై ప్రత్యేక శిక్షణ తీసుకునేవారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ ని తారక్ 11 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మొదటిసారి చూసాడట. అప్పటివరకు ఫోటోల్లో చూడటమే గాని డైరెక్ట్ గా చూడలేదట.

 అప్పుడే ఎన్టీఆర్ పేరు పెట్టారు..

అప్పుడే ఎన్టీఆర్ పేరు పెట్టారు..

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేను 101 డిగ్రీల జ్వరంతో ఉన్నప్పుడు తాత గారి నుంచి కబురు వచ్చింది. అప్పుడు ఆయన అబిడ్స్ లో ఉండేవారు. ఆయన కలవాలని సంతోషంలో అక్కడికి వెళ్ళాను. మొదటిసారి తాత గారిని చూసి ఎంతగానో సంతోషించాను. కొద్దీ సేపు నా వైపు చూసి నాన్నను పిలిచారు. వీడే నా వారసుడు.. తారక్ రామ్ అనే పేరు తీసేసి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టండి అంటూ సీనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు జూనియర్ ఎన్టీఆర్ వివరించాడు.

మా అమ్మ చేతి వంట ఆయనకు ఇష్టం..

మా అమ్మ చేతి వంట ఆయనకు ఇష్టం..

ఒక ఏడాది వరకు తాత గారి దగ్గరకు రెగ్యులర్ గా వెళుతుండేవాడిని. ఆయనను తాత తాత అంటూ సరదాగా ఎన్నో మాట్లాడేవాన్ని. తెలియని ఒక సంతోషంలో మునిగిపోయేవాడిని. ఒకరోజు మా అమ్మ చేసిన వంట రుచి చూసిన తాత గారు ఆ తరువాత రోజు ఇంటి నుంచి క్యారెజ్ తెప్పించుకునేవారు.

ఆ మాటలు మర్చిపోలేను..

ఆ మాటలు మర్చిపోలేను..

ఒకరోజు అమ్మను పిలిపించి ఇన్నాళ్లు జరిగిన విషయాల్ని మర్చిపోండి అని ఆప్యాయంగా పలకరించారు. తాత గారు అమ్మని పిలిచి ఒక మంచి మాట అన్నారు. నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు.. నా అంతటి వారిగా అతన్ని తీర్చిదిద్దేలా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు.. నా వంతు బాధ్యతను నేను నిర్వర్తిస్తాను.. అని తాత గారు చెప్పగానే సంతోషం వేసింది. ఆ మాటలను నేను ఇప్పటికి మర్చిపోలేను.

కోపం వచ్చింది

కోపం వచ్చింది

కానీ ఆయన ఆ తరువాత చనిపోగానే చాలా బాధ వేసింది. మాకు ఒక దిక్కు వచ్చిందనే ధైర్యంలో ఉన్నప్పుడే.. ఇంతలోనే అనాధగా వదిలేసారని బాధలో కోపం వచ్చిందని ఆయన పేరుతోనే ఇంతటి వాడిని అయ్యానని జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో బావోద్వేగంతో వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X