War 2: నా వెంట ఎవరు లేరు.. నన్ను ఎవరూ ఆపలేరు.. వార్ 2 ఈవెంట్‌లో జూ ఎన్టీఆర్

బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్'గా నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందుతున్నది. వార్ 2 సినిమా తెలుగు, హిందీ, తమిళంలో ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్నది.

అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి 25 ఏళ్లు కావడం. ఈ సందర్భంగా గత 25 ఏళ్లలో జరిగిన విషయాలను, తనకు తోడుగా నిలిచిన వారికి శిరసు వంచి పాదాభివందనం చేసి ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ..

Jr NTR Emotional about 25 years of Film Journey in Telugu Industry

25 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు రామోజీరావు తన బ్యానర్‌పై నన్ను చూడాలని ఉంది అనే సినిమా ద్వారా పరిచయం చేశారు. ఆ సినిమా ఓపెనింగ్ వెడుక సమయంలో నా వెంట మా నాన్న, మా అమ్మ మాత్రమే ఉన్నారు. నేను ఒక్కడినే వెళ్లాను. ఏం జరుగుతుందో.. ఎలా ఉండబోతుందో.. ఏమవుతుందో తెలియదు. కానీ మొట్టమొదటగా ఆదోని నుంచి ముజీబ్ అనే అభిమాని నన్ను కలిశాడు. నేను ఆఫీస్ వద్ద ఉంటే.. కనిపిస్తే.. ఎవరు మీరు అంటే.. బాబు నీ అభిమానిని అని చెప్పాడు. మీరు అంటే చచ్చిపోతాను అని అంటే.. చచ్చిపోవద్దు.. ఇంకా నా సినిమా ఒకటి కూడా రిలీజ్ కాలేదు.. ఫ్యాన్ ఎంటని అంటే.. మీతోనే ఉంటానని చెప్పారు. ఆయనతోపాటు ఎంతో మంది నా వెంట నడిచారు. ఇంతమంది అభిమానులు దొరకడం పూర్వజన్మ సుకృతం అని ఎన్టీఆర్ గుర్తు చేసుకొన్నారు.

ఇంతటి అభిమానం సంపాదించుకోవడానికి కారకులైన మా నాన్న గారు హరికృష్ణ, అమ్మ గారు షాలిని, అమ్మగారు లక్ష్మీ గారు ధన్యవాదాలు చెప్పుకోవాలి. మా అన్న గారు.. కీర్తి శేషులు జానకీరామ్, మరో అన్న గారు కల్యాణ్ రామ్‌కి నాపై ఆశీస్సులు ఉండటం నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతోపాటు నన్ను అశీర్వదించిన నిర్మాతలు, నన్ను ప్రేమించి మంచి చిత్రాలు ఇచ్చిన దర్శకులకు నా శిరసు వంచి నమస్కారాలు చేసుకొంటున్నాను. నాతో ప్రతీ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. 25 సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహిస్తున్న మీడియా వారికి శిరసు వంచి పాధాభివందనం చేసుకొంటున్నాను.

ఎన్ని సంవత్సరాలు దాటినా.. ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారక రామారావు ఆశీస్పులు నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు. అలాగే ఇంట్లో ఉండి.. సినిమాలు, షూటింగులు చేసుకొంటే.. నా రత్నాల్లాంటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చిన భార్య ప్రణతి, నా కొడుకులిద్దరికి ప్రేమతో కూడిన హగ్స్ ఇస్తాను. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. నన్ను కడుపులో పెట్టుకొని.. నేను చేసిన తప్పుల్ని క్షమిస్తూ.. నా ఆనందం, బాధలను పంచుకొని.. నేను ఇంట్లో సుఖంగా పడుకొన్నా నా కోసం ప్రార్థించిన తీరుకు ఎన్ని జన్మలెత్తిన రుణం తీర్చుకోలేను. వారందరికి శిరసు వచ్చి పాధాభివందనం చేసుకొన్న సరిపోదు అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

మా నాన్నగారిలో చెప్పాను. కొడుకుగా జన్మనిచ్చినందుకు.. ఈ జీవితం మీకే అంకింతం అని చెప్పాను. ఈ జన్మకిది చాలూ. ఇంతకంటే ఏమీ అక్కర్లేదు. జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచేందుకు అడుగులు పడుతాయే కానీ.. మరోటి ఉండదు. 25 ఏళ్లుగా నాతో ఉన్నందుకకు శిరసు వంచి పాధాభివందనం చేసుకొంటాను. ఇంకా ముందుకు వెళ్తాను. మీ అందరితో కలిసి ముందుకెళ్లాను. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను అని ఎన్టీఆర్ అన్నారు.

ఎవరు ఎన్ని మాట్లాడుకొన్నా వార్ 2 బొమ్మ అదిరిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్. కానీ ఒక రిక్వెస్ట్. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. వాటిని దయచేసి బయటపెట్టకండి. సినిమా రిలీజ్ తర్వాత ట్విస్టులను బయటపెట్టడం సరికాదు. కానీ ఎంత వీలైతే అంత సేపు ట్విస్టులను దాచిపెట్టండి. సినిమాను ఎంజాయ్ చేయండి.. ప్రతీసారి సింగిల్ కాలర్ ఎత్తుతాను. వార్ 2 కు డబుల్ కాలర్ ఎత్తాను. కుమ్మేద్దాం. సినిమాను ఎంజాయ్ చేయండి అని ఎన్టీఆర్ అన్నాడు.

More from Filmibeat

Read more about: jr ntr war 2 hrithik roshan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X