For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పులి ఎన్‌క్లోజర్‌లోకి ఎన్టీఆర్: రియాలిటీ కోసం రిస్క్ తీసుకున్న నందమూరి హీరో.. గూస్‌బంప్స్ ఖాయం.!

  By Manoj Kumar P
  |

  జూనియర్ ఎన్టీఆర్... బడా ఫ్యామిలీ నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తన టాలెంట్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. అంతేకాదు, చిన్న వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. క్లాసికల్ డ్యాన్సర్ అయిన తారక్.. అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంటాడు. అలాగే, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అతడి గురించి ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. సినిమా కోసం తారక్ ఎంతో రిస్క్ చేశాడట. ఆ వివరాల కోసం పూర్తిగా చదవండి.!

  Jr NTR Action Scene With Tiger In RRR Remembers A Hollywood Movie
  వరుస విజయాలతో దూకుడు మీదున్న తారక్

  వరుస విజయాలతో దూకుడు మీదున్న తారక్

  కొన్నేళ్ల పాటు వరుస పరాజయాలతో సతమతమయ్యాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్'తో అతడు హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని ఈ నందమూరి హీరో.. వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

  జక్కన్న చెప్పాడని మెగా హీరోతో కలిశాడు

  జక్కన్న చెప్పాడని మెగా హీరోతో కలిశాడు

  వరుస విజయాల తర్వాత తారక్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో అతడు నిజాం ప్రభువులపై పోరాడిన కొమరం భీంగా కనిపించనున్నాడు. అందుకోసం ప్రత్యేకమైన గెటప్‌తో తారక్ దర్శనమివ్వబోతున్నాడు. అలాగే, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నాడు. వీరితో పాటు ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు.

  ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ప్లాన్స్

  ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ప్లాన్స్

  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. ముఖ్యంగా లుక్, ఫిజిక్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందుకోసం ఫిట్‌నెస్ ట్రైనర్ నుంచి శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. ఇటీవల లీక్ అయిన వీడియోలు, ఫొటోలలో తారక్ లుక్ చూసిన వారికి అతడి కష్టం కనిపిస్తోంది. వాటి పట్ల ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

  సినిమాలో హైలైట్.. ఎన్టీఆర్ ఎంట్రెన్స్ ఫైట్

  సినిమాలో హైలైట్.. ఎన్టీఆర్ ఎంట్రెన్స్ ఫైట్

  RRR మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రెన్స్ ఫైట్ హైలైట్‌గా ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. ఆ ఫైట్‌లో తారక్.. పులితో పోరాటం చేయడమే. కొమరం భీమ్ అడవుల్లో ఎక్కువగా ఉండేవాడట. అది చూపించే పనిలో భాగంగానే ఈ ఫైట్ పెట్టారని అంటున్నారు. ఈ సీన్‌ను ‘300 యోధులు' సినిమా నుంచి స్ఫూర్తి పొందారని ప్రచారం జరుగుతోంది.

   పులి ఎన్‌క్లోజర్‌లోకి ఎన్టీఆర్.. గూస్‌బంప్స్ ఖాయం.!

  పులి ఎన్‌క్లోజర్‌లోకి ఎన్టీఆర్.. గూస్‌బంప్స్ ఖాయం.!

  తాజాగా ఈ ఫైట్‌కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ పోరాట సన్నివేశం కోసం తారక్ నిజంగానే పులి ఉంటున్న ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడట. దూరం నుంచి కనిపించే సీన్స్ కోసమే ఎన్టీఆర్ రిస్క్ తీసుకుని మరీ అందులోకి వెళ్లాడని అంటున్నారు. క్లోజ్ షాట్స్ మాత్రం కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా కవర్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

  గుండుతో కనిపించనున్న జూనియర్ ఎన్టీఆర్

  గుండుతో కనిపించనున్న జూనియర్ ఎన్టీఆర్

  ఇక, ఇదే సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని కూడా ఆ మధ్య ప్రచారం జరిగింది. దీని ప్రకారం.. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ కోసం తారక్ గుండుతో కనిపించబోతున్నాడట. పదిహేను నిమిషాల పాటు ఉండే ఈ సీన్ కోసం అతడు తన తల వెంట్రుకలను త్యాగం చేయబోతున్నాడని అంటున్నారు. దీంతో అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  RRR is an upcoming 2021 Indian Telugu-language period action film written and directed by S. S. Rajamouli. It stars N. T. Rama Rao Jr., Ram Charan, Alia Bhatt and Ajay Devgn It is a fictional story revolving around India's freedom fighters, Alluri Sitarama Raju and Komaram Bheem who fought against the British Raj and the Nizam of Hyderabad, respectively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X