Jr NTR for Oscar: ఎన్టీఆర్ మరో సంచలన రికార్డు.. ఆస్కార్ లిస్టులో చోటు.. ఏకైక ఇండియన్ హీరోగా చరిత్ర

ప్రముఖ సినీ కుటుంబం నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టినా.. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్య కాలంలో వరుసగా విజయాలను అందుకుంటోన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. మరీ ముఖ్యంగా గత ఏడాది RRR మూవీతో పాన్ ఇండియా సక్సెస్‌ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. తన రేంజ్‌ను కూడా పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుని ఏకైక ఇండియన్ హీరోగా రికార్డు సాధించాడు. ఆ వివరాలు మీకోసం!

అంతర్జాతీయ స్థాయికి ఎన్టీఆర్

అంతర్జాతీయ స్థాయికి ఎన్టీఆర్

వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే, తారక్‌కు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ను తీసుకొచ్చి పాన్ వరల్డ్ స్టార్‌‌ను చేసేసింది.

ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!
https://telugu.filmibeat.com/television/ariyana-glory-fabulous-selfie-video-viral-in-internet-116117.html

ఎన్టీఆర్ యాక్టింగ్‌కు నీరాజనం

ఎన్టీఆర్ యాక్టింగ్‌కు నీరాజనం

జూనియర్ ఎన్టీఆర్ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో కొమరం భీమ్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఇందులో అతడు చేసిన నటన, పలికించిన హావభావాలు, చూపించిన ఎమోషన్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఇండియాలోనే కాదు.. ఈ సినిమా విడుదలైన అన్ని దేశాల్లోనూ తారక్ నటనకు అక్కడి ప్రేక్షకులూ నీరాజనం పలికారు.

 తారక్‌కు పెరిగిన ఫాలోయింగ్

తారక్‌కు పెరిగిన ఫాలోయింగ్

అత్యధిక బడ్జెట్‌తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తీరుకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇండియాలోనే కాదు.. అతడి కీర్తి విశ్వవ్యాప్తం అయిపోయింది. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయిందని అనుకోవచ్చు.

 ఆస్కార్ రేసులో యంగ్ టైగర్

ఆస్కార్ రేసులో యంగ్ టైగర్

ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వెరైటీ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి గానూ ఆస్కార్ అవార్డుకు అర్హులైన కొందరు నటీనటులు, టెక్నీషియన్లను అంచనా వేస్తూ లిస్టులు రెడీ చేసింది. ఇందులో ఉత్తమ నటుడు విభాగంలో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో చేసిన నటనకు గానూ జూనియర్ ఎన్టీఆర్, చరణ్ పేర్లను ఈ జాబితాలో చేర్చింది. దీనిపై ఇద్దరి ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

టాప్ 10లో.. ఏకైక ఇండియన్

టాప్ 10లో.. ఏకైక ఇండియన్

వెరైటీ మ్యాగజైన్ 2023 ఉత్తమ నటుల విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ పేరును చేర్చడం అప్పట్లో హైలైట్ అయింది. అయితే, తాజాగా ఈ సంస్థ ఆ లిస్టును కుదిస్తూ టాప్ 10 యాక్టర్స్ పేర్లను ప్రకటించింది. ఇందులో కూడా ఎన్టీఆర్ పేరును చేర్చింది. దీంతో ఇండియా నుంచి వెరైటీ ప్రెడిక్షన్ టాప్ 10 లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక హీరోగా అతడు కొత్త చరిత్రను సృష్టించాడు.

ఎన్టీఆర్ చేసే సినిమాలు ఇవే

ఎన్టీఆర్ చేసే సినిమాలు ఇవే

తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన, గ్లిమ్స్ వీడియో కూడా వచ్చాయి. దీన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీని తర్వాత అతడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తోనూ సినిమా చేయబోతున్నాడు. అలాగే, మరికొందరు దర్శకులతోనూ చర్చలు జరుపుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X