Devara : ఆ రోజు చనిపోతా అనుకున్నా .. ప్రణతి, పిల్లలు ఏమైపోయేవారో.. ఎన్టీఆర్ ఎమోషనల్
ప్రేక్షకులకు మూడు గంటల పాటు వినోదాన్ని అందించడం కోసం సినీ నటులు, టెక్నీషియన్లు, కార్మికులు ఎంతో శ్రమిస్తారు. సెట్స్‌లో జరిగిన ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారు, అంగవైకల్యం పొందినవారు ఎందరో. అయినప్పటికీ ప్రమాదాలను లెక్క చేయకుండా సినిమాపై ప్రాణం పెట్టి పనిచేసేవారు ఎందరో. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా షూటింగ్ సమయంలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారట. ఈ వివరాల్లోకి వెళితే..
ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా , సైఫ్ అలీఖాన్ తదితరులు కీలకపాత్రలు పోషించగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవర. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ .. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ అనంతరం లాంగ్ గ్యాప్ తర్వాత జూనియర్ నటించిన సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్‌లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

రిలీజ్‌కు ముందు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించింది. ముంబైలో సెప్టెంబర్ 10న ట్రైలర్ లాంచ్ అవ్వగా.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో ఈవెంట్స్ జరిగాయి.సెప్టెంబర్ 22న హైదరాబాద్ నోవాటెల్‌లో దేవర ప్రీ రిలీజ్ నిర్వహించాలని చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు పోటెత్తడంతో నోవాటెల్ లోపల, బయట కిక్కిరిసిపోయింది.
కార్యక్రమం మొదలయ్యేలోపే ఇంత క్రౌడ్ ఉంటే , తర్వాత పరిస్ధితి ఏంటని నిర్వాహకులు భయపడ్డారు. అప్పటికే ఏర్పాట్లు సరిగా లేవంటూ ఎన్టీఆర్ అభిమానులు ఫర్నీచర్ , అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పరిణామాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నట్లుగా నిర్వాహకులు ప్రకటించడంతో తారక్ అభిమానులు నిరాశకు గురయ్యారు.
దేవర షూటింగ్‌లో ఉన్నప్పుడే ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా తారక్ ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది.. ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుని కోలుకున్నారు. అయితే దీనిపై మీడియాలో రకరకాల కథనాలు రావడంతో ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. తారక్ క్షేమంగానే ఉన్నారని.. ప్రమాదంపై ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. అయితే దేవర షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
దేవర ప్రమోషన్‌లో భాగంగా యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డలు ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సమయంలో గోవాలో జరిగిన ఇన్సిడెంట్‌ను తారక్ షేర్ చేసుకున్నారు. విపరీతమైన వేడిలో సముద్రంలో నవ్వుకుంటూ ఉండాలని, మాపై సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడని ఎన్టీఆర్ చెప్పారు. మా పక్కనే ఏసీ ఉన్న రూమ్ ఉందని.. దాంతో తాను వెళ్లిపోతానని కొరటాల శివను అడగ్గా.. ఆయన ఒక్క షాట్ అని బతిమలాడారని తారక్ వెల్లడించారు. ఆ పరిస్ధితితో ఒక్క సెకను నిజంగానే చచ్చిపోయినట్లుగా అనిపించిందని.. ప్రణతి, పిల్లలు ఏమైపోతారోనని భయం వేసిందని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











