For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. బాబు ఇలాకాలో ఎగిరిన ఎన్టీఆర్ జెండా!

  |

  జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు.. అయితే ఆయన సినిమాల్లో ఉన్నా సరే ఎప్పటికప్పుడు ఆయన రాజకీయాల్లోకి రావాలని ఫాన్స్ డిమాండ్ చేస్తూ ఉంటారు.. తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఫ్యాన్స్ మాత్రం వినిపించుకోరు. తాజాగా ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఫ్యాన్స్ చేసిన పని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  2009 ఎన్నికల్లో

  2009 ఎన్నికల్లో

  నందమూరి కుటుంబం అంటే తెలియనివారుండరు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ముందు సినిమాల్లో తన సత్తా చాటారు.. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనలాంటి నటుడు మరొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే నందమూరి కుటుంబానికి రాజకీయాలతో కూడా ఉండడంతో ఎన్టీఆర్ కూడా 2009 ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పటికే ఐదేళ్ల నుంచి అధికారంలోకి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రచారం చేశారు.

  యాక్టివ్ గా కనిపించింది లేదు

  యాక్టివ్ గా కనిపించింది లేదు

  అయితే అనుకోకుండా ప్రచార నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఖమ్మం జిల్లాలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో పార్టీ కూడా గెలవలేదు. అప్పటి నుంచి మళ్లీ ఆయన తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా కనిపించింది లేదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఎలాంటి సంక్షోభం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముఖ్యంగా ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది.. ఆయన పార్టీ పగ్గాలు చేపడితే కానీ పార్టీకి పునర్వైభవం రాదంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు.

  ఒక కార్యకర్తగా పని చేస్తా

  ఒక కార్యకర్తగా పని చేస్తా


  అయితే ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉండే అదుర్స్ సినిమా నిర్మాత కొడాలి నాని అప్పట్లో పార్టీ మారి వైఎస్ఆర్సిపిలో జాయిన్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ దీని వెనుక ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.. అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టిన ఎన్టీఆర్ తాను ఎప్పటికీ టీడీపీలోనే ఉంటానని, తెలుగు దేశం కోసం ఒక కార్యకర్తగా పని చేస్తానని తన అవసరం వచ్చిందని అనిపిస్తే అప్పుడు వెళ్లి సేవలు అందిస్తా అని చెప్పుకొచ్చారు..

  కుప్పంలో కలకలం

  కుప్పంలో కలకలం

  అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ ఎన్టీఆర్ ముఖంతో ఉన్న ఒక జెండా ఆవిష్కరించి కలకలం రేపారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ కు వరసకు మామయ్యే చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం మండలంలోని పంచాయములకలపల్లి అనే గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఈ జండా ఎగరేసినట్లు చెబుతున్నారు. నిజానికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకురావాలని మొన్న జనవరి నెలలో చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే చంద్రబాబు నుంచి పెద్దగా స్పందన ఏమీ లేదని అంటున్నారు.

   మొన్ననే అడిగితే

  మొన్ననే అడిగితే

  ఈ క్రమంలోనే వీళ్ళు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ ఆయన ఫోటోతో ఉన్న జెండాను ఎగరవేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల గురించి ప్రశ్నించగా ఆయన దాటవేశారు. ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నపుడు మాట్లాడుకుందాం అంటూ ఆయన కామెంట్ చేయడం ఆయన అభిమానులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.

  English summary
  Junior NTR fans hoists a flag with NTR image in chandrababu Naidu's kuppam constituency and demands NTR to become active in Andhra Pradesh politics.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X