Jr NTR: పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ సంచలన వాఖ్యలు.. నందమూరి ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్!
ప్రస్తుతం దక్షిణాది సినిమా దగ్గర సినిమాలు అలాగే రాజకీయాలు నడుమ దూరం మరింత తక్కువ అవుతూ వస్తున్నా సంగతి అంతా చూస్తూనే ఉన్నారు. సినిమాకి సంబంధించిన వారు రాజకీయాల్లోకి రావడం రాజకీయాల్లో ఉన్న వారు సినిమాల్లో ఉన్న వారి సపోర్ట్ తీసుకోవడం ఇలా పరస్పరం ఒక ప్రాసెస్ లా ఇది జరుగుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ వాటి ఫ్లేవర్స్ మరింత కనిపిస్తాయి.
సరే ఇది బాగానే ఉంది. తెలుగు సినిమా నుంచి అనేక మంది దిగ్గజాలు రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు పలువురు హీరోలు, హీరోయిన్స్ కూడా బిజీగా ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే తెలుగు స్టేట్స్ లో ఉన్న హీరోస్ లో ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు లేకుండా ఆ ప్రస్తావనే ఉండదు.

ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం కోసం ఆసక్తికర చర్చలు, గొడవలు కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి. మరి అసలు రాజకీయాలు కోసం ప్రస్తుతం ఎన్టీఆర్ ఏమనుకుంటున్నాడో తెలుసా? దీనికి సమాధానం లేటెస్ట్ గా ఓ ఓటిటి షోలో నందమూరి తారక రాముడు అందించాడు. ఇటీవల తాను నటించిన పాన్ ఇండియా సినిమానే "దేవర".
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఫేమస్ టాక్ షో అయినటువంటి కపిల్ శర్మ టాక్ షోలో తన దేవర నటీనటులు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ తో కలిసి పాల్గొన్నాడు. కాగా ఈ ఎపిసోడ్ పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ ఎపిసోడ్ లో అయితే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై కపిల్ శర్మ ఆసక్తికర ప్రశ్న అడిగాడు.
ఎన్టీఆర్ గారు మీరు మీ అభిమానులని ఎప్పుడు మీకు ఓటర్స్ గా మార్చుకోబోతున్నారు అని అడిగిన ప్రశ్నకి తారక్ తెలివైన సమాధానం ఇచ్చాడు. తనకి తన అభిమానులని ఓటర్స్ గా మార్చుకోవడం ఇష్టం లేదని తనకోసం టిక్కెట్స్ కొనుక్కుంటే అదే చాలు వారి నుంచి నాకు ఎక్కువేమీ వద్దు అంటూ తనకి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని అసలు విషయాన్ని రివీల్ చేసాడు.

తాను ప్రస్తుతానికి ఇలాగే ఆనందంగా ఉన్నానని... ఇదే తన వరకు తెలివైన నిర్ణయం అనుకుంటున్నాను అని ఎన్టీఆర్ అదిరే సమాధానం ఇచ్చాడు. దీనితో తాను మాత్రం పాలిటిక్స్ పరంగా అంత ఇంట్రెస్డ్ గా లేడని ఇప్పుడు క్లియర్ అయ్యిపోయింది. సో ఎన్టీఆర్ నుంచి పొలిటికల్ పరంగా ఎలాంటి ఎంట్రీ ఉండబోదని చెప్పాలి.
కాగా ఈ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ నెట్ ఫ్లిక్స్ లో మంచి ఆదరణతో దూసుకెళ్తుంది. ఇంకో పక్క తన "దేవర" థియేటర్స్ లో పాన్ ఇండియా భాషల్లో భారీ వసూళ్లతో సత్తా చాటుతుంది. కాగా ఈ చిత్రంని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా కొత్త నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











