For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2023 OSCARS: ఆస్కార్ లిస్టులో ఎన్టీఆర్.. ఆసియా నుంచి ఒకే ఒక్కడు.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్

  |

  నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా అన్ని రకాల టాలెంట్లను చూపించి స్టార్‌గా వెలుగొందుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'టెంపర్' నుంచి హిట్ ట్రాక్ ఎక్కి వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. ఇక, ఇటీవలే RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఆసియాలోనే ఏకైక హీరోగా రికార్డు సాధించాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  వరుస హిట్లతో భీకరమైన ఫామ్‌

  వరుస హిట్లతో భీకరమైన ఫామ్‌

  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. 'టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. అప్పటి నుంచి అతడు రెట్టించిన జోష్‌తో కనిపిస్తున్నాడు.

  ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది

  పాన్ ఇండియా రేంజ్‌కు తారక్

  పాన్ ఇండియా రేంజ్‌కు తారక్

  విజయాల పరంపరతో ఫుల్ జోష్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే, తారక్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది.

  భీమ్ పాత్రకు ప్రేక్షకులు ఫిదా

  భీమ్ పాత్రకు ప్రేక్షకులు ఫిదా


  RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఇందులో అతడు చేసిన నటన, పలికించిన హావభావాలు, చూపించిన ఎమోషన్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఇండియాలోనే కాదు.. ఈ సినిమా విడుదలైన అన్ని దేశాల్లోనూ తారక్ నటనకు అక్కడి ప్రేక్షకులూ ఫిదా అయ్యారు.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం

  తారక్‌కు పెరిగిన ఫాలోయింగ్

  తారక్‌కు పెరిగిన ఫాలోయింగ్

  భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తీరుకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇండియాలోనే కాదు.. అతడి కీర్తి ఖండాంతరాలు దాటిపోయింది. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు.

  ఆస్కార్ లిస్టులో యంగ్ టైగర్

  ఆస్కార్ లిస్టులో యంగ్ టైగర్

  ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన వెరైటీ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి గానూ ఆస్కార్ అవార్డుకు అర్హులైన కొందరు నటీనటులు, టెక్నీషియన్లను అంచనా వేస్తూ లిస్టులు రెడీ చేసింది. ఇందులో ఉత్తమ నటుడు విభాగంలో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో చేసిన నటనకు గానూ జూనియర్ ఎన్టీఆర్ పేరును ఈ జాబితాలో చేర్చింది. దీనిపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

  ఆసియా నుంచి ఒకే ఒక్కడు

  ఆసియా నుంచి ఒకే ఒక్కడు

  వెరైటీ మ్యాగజైన్ 2023 ఉత్తమ నటుల విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ పేరును చేర్చడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది. ఇక, ఈ సంస్థ తయారు చేసిన జాబితాలో ఆసియా ఖండం నుంచి ఎన్టీఆర్ తప్ప మరో హీరో ఎవరూ లేకపోవడం విశేషం. ఇక, ఈ వార్త బయటకు రావడంతో నందమూరి ఫ్యాన్స్ NTRGoesGlobal అనే ట్యాగ్‌ను యమా ట్రెండ్ చేస్తున్నారు.

  తారక్ చేసే సినిమాలు ఇవే

  తారక్ చేసే సినిమాలు ఇవే

  ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన, గ్లిమ్స్ వీడియో కూడా వచ్చాయి. దీన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీని తర్వాత అతడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తోనూ సినిమా చేయబోతున్నాడు. అలాగే, బుచ్చిబాబు సనతోనూ ఓ ప్రాజెక్టును కమిట్ అయ్యాడు.

  English summary
  Tollywood Star Hero Jr NTR Recently Did RRR Movie Under Rajamouli Direction. Now He Got Placeed in Variety magazine OSCAR prediction List.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X