NTR: క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్..ఏమన్నారంటే?

NTR: సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లను దేవుళ్లలాగా ఆదరిస్తారు. అవసరమైతే.. గుళ్లు కట్టి పూజిస్తారు కూడా. బాలీవుడ్ లో సినిమా స్టార్స్ ను ఎలా చూస్తారో తెలియదు గానీ.. టాలీవుడ్‌లో మాత్రం ప్రతి హీరోకు, హీరోయిన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు నేడు పాన్ ఇండియా రెంజ్ లో విడుదలవుతున్నాయంటే.. అది ఆయన ఫ్యాన్స్ వల్లే.. అందుకే ఆయన తన ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయడానికి వెనకాడాడు. తనని ప్రేమించే అభిమానులకు అండగా నిలుస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాజాగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి తాజాగా వీడియో కాల్‌ చేసి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం మాట్లాడారో మీరు కూడా ఓ లూక్కేయండి.

వాస్తవానికి ఎన్టీఆర్ మూవీ 'దేవర' ఫీవర్ ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది.ఎప్పడెప్పుడని ఆయన అభిమానులు వర్డల్ వైడ్ గా ఎదురుచూస్తున్నారు. ఆయన కూడా దేవర మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీబిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ బాధకరమైన విషయం ఆయన ద్రుష్టికి వచ్చింది. అదే.. తిరుపతికి చెందిన కౌశిక్‌ (19) ఆయన ఎన్టీఆర్ వీరాభిమాని. ఆయన కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కౌశిక్ తన తల్లిదండ్రులతో 'నేను బతకనని తెలుసు. నా కోసం బాధపడకండి. దేవర సినిమా విడుదల వరకూ బతికించండి చాలు. నా చివరి కోరిక తీర్చండి' అంటూ వేడుకున్నాడు.

Jr NTR had a video call to his fan who is fighting cancer this video viral

ఈ విషయాన్ని కౌశిక్ తల్లిదండ్రులు మీడియాతో చెప్పారు. తన బిడ్డ బతికించండంటూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ లను వేడుకున్నారు. తమ కొడుకును బతికించాలని, దాతలు సాయం చేయాలంటూ మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడి వైద్యానికి రూ. 60 లక్షలు ఖర్చు అవుతుందని మీకు తోచినంత సహాయం చేయాలంటూ అందరినీ కోరారు. ఈ వీడియో నెటింట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ నోట .. ఈ నోట జూనియర్ ఎన్టీఆర్ ద్రుష్టికి రావడంతో వెంటనే స్పందించారు..

జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడారు. '' నువ్వు నవ్వితే.. బాగున్నావ్..' అని ఎన్టీఆర్ అనగానే.. థ్యాంక్యూ అంటూ కౌశిక్ ఎమోషనల్ అయ్యాడు. సార్ మిమ్మల్నీ అస్సలు చూస్తానని అనుకులేదు. వెంటనే తారక్ ..''నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో.. ధైర్యంగా అస్సలూ కోల్పోవద్దు. త్వరగా కోలుకుని బయటకు రావాలి. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కూడా ఆ దేవుడ్ని ప్రార్థిస్తాను' అని ఎన్టీఆర్‌ అన్నారు.

ఆ తరువాత కౌశిక్ తల్లిదండ్రులతో కూడా తారక్ మాట్లాడారు. 'మీరు నవ్వుతూ ధైర్యంగా ఉంటే.. మీ బిడ్డ త్వరగా కోలుకుంటాడు. మీరు పక్కన ఉంటే.. అతనికి కొండంత బలం వస్తుంది' అని ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ వీడియో కాల్ చేయడంతో కౌశిక్ , తన కుటుంబం చాలా సంతోషపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలాఉంటే.. కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర'. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతుంది. దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్స్‌తో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్నా ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో తారక్ యాక్షన్, డైలాగ్స్, విజువల్స్ సినిమా పై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

More from Filmibeat

Read more about: jr ntr fan devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X