twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి సినిమాల రేసులోకి జూనియర్ ఎన్టీఆర్.. మెగా హీరోలకు పోటీగా దించుతున్నారు.!

    By Manoj
    |

    రూపంలో, నటనలో తాత నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. నందమూరి హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన తారక్.. నటన, డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీ, ఎమోషన్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నేళ్లుగా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొన్ని ప్రయోగలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ బడా మూవీలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా సంక్రాంతి రేసులో నిలిచాడు. అదేలా అనుకుంటున్నారా.? అయితే పూర్తిగా చదవండి.

    కొమరం భీంగా మారిన జూనియర్

    కొమరం భీంగా మారిన జూనియర్

    జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR' అనే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో తారక్.. కొమరం భీంగా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 20, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    లీకైన వీడియో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ

    లీకైన వీడియో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ

    ఇటీవల ‘RRR' షూటింగ్ స్పాట్‌ నుంచి ఓ వీడియో లీక్ అయింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఈ వీడియోలో జూనియర్.. కొమరం భీం గెటప్‌లో కనిపించాడు. అప్పట్లో ఆయన ఎలా ఉన్నాడో తెలియకపోయినా, ఈ పాత్రకు సరిగ్గా సూట్ అయ్యేలా కనిపించడంతో.. నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

     సంక్రాంతి రేసులోకి వస్తున్నాడు

    సంక్రాంతి రేసులోకి వస్తున్నాడు

    జూనియర్ ఎన్టీఆర్ సంక్రాంతి సినిమాల రేసులోకి వస్తున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా'. ఈ సినిమా సంక్రాంతి పండుగ రోజు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు తారక్ ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నాడని ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

     మెగా హీరోలకు పోటీగా దించుతున్నారు.!

    మెగా హీరోలకు పోటీగా దించుతున్నారు.!

    సంక్రాంతి సందర్భంగా మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ సినిమా ‘అల.. వైకుంఠపురములో' విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మెగా హీరోలు వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వాళ్లకు ధీటుగా ‘ఎంత మంచివాడవురా' టీమ్ జూనియర్ ఎన్టీఆర్‌ను దింపుతుందనే టాక్ వినిపిస్తోంది.

    మంచివాడిగా మారిన కల్యాణ్ రామ్

    మంచివాడిగా మారిన కల్యాణ్ రామ్

    కల్యాణ్ రామ్ ప్రస్తుతం ‘శతమానం భవతి' ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో ‘ఎంత మంచివాడవురా' అనే సినిమా చేస్తున్నాడు. మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీసుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ అధినేత ఉమేష్ గుప్త సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Entha Manchivaadavuraa is an upcoming Indian Telugu-language action drama film directed by Satish Vegesna. An official remake of the Gujarati-language film Oxygen, it stars Kalyan Ram and Mehreen Pirzada in the lead roles, with the music composed by Gopi Sundar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X