Jr NTR: నేను బోనస్‌గా దొరికేశాగా.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్.. నెటిజన్లు ఫిదా
నిన్ను చూడాలని సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కాలంగా సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తున్నాడు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇటీవల RRR సినిమాలో కొమురం భీమ్ గా నటించి తన నటనాకౌశల్యాన్ని యావత్ ప్రపంచానికి చూపించాడు. దీంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్ తాజాగా దుబాయ్ ఎయిర్ పోర్ట్ వద్ద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగులో కాకుండా: తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత తారక్ చేసే ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగినట్లుగానే ఎన్టీఆర్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తారక్ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమా చేస్తున్నాడు.

అలాంటి విలన్: జూనియర్ ఎన్టీఆర్ తెలుగులో కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా తారక్ కు జోడ కట్టనుంది. ఇక కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో NTR31లో కూడా నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వార్ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోన్న వార్ 2లో తారక్ పవర్ ఫుల్ విలన్ గా దర్శనం ఇవ్వనున్నాడు.

పోటాపోటీ యాక్షన్స్: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రధాన హీరోగా తెరకెక్కుతున్న ఈ స్పై యూనివర్స్ మూవీ వార్ 2ను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ మూవీని పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయగా.. సీక్వెల్ మూవీ వార్ 2కి బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో హృతిక్-తారక్ మధ్య పోటాపోటీ యాక్షన్ సీన్స్ ఉంటాయని టాక్.

నెటిజన్లు ఫిదా: ఇలా వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ మాటకారితనం, చమత్కారం, స్పాంటెనిటీ గురించి తెలిసిందే. తారక్ ఎంత సరదాగా ఉంటారో ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ ఈవెంట్స్ చూస్తే తెలిసిపోతుంది. అలా తాజాగా ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
దొరికేశాను కదా: అయితే ఎన్టీఆర్ ఇవాళ అంటే జూన్ 24న ఉదయం దుబాయ్ వెళ్లాడు. దుబాయ్ ఎయిర్ పోర్టులో ఒక వీడియో గ్రాఫర్ ఉన్నాడు. అతనితో "ఎందుకు వచ్చావ్" అని ఎన్టీఆర్ అడిగాడు. అప్పుడు అతను బాలీవుడ్ పాప్ సింగర్ బాద్ షా వస్తున్నారు, ఆయన కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. దీనికి "అంటే నేను బోనస్ గా దొరికేశా కదా. అంతే కదా" అని ఎన్టీఆర్ అన్నాడు. అయితే ఈ మాటల సమయంలో ఎన్టీఆర్ కనిపించలేదు కానీ, మాటలు మాత్రం వినిపించాయి.


Click it and Unblock the Notifications











