twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మల్టీస్టారర్ విషయంలో సీరియస్ అయిన ఎన్టీఆర్.. బాలా బబాయ్ సహా వాళ్ళతో నటించాలని ఉందంటూ కామెంట్స్!

    |

    గడిచిన కొంత కాలంగా మల్టీస్టారర్ సినిమాల పట్ల దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంత కాలంగా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, చివరకు బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని సినిమా పరిశ్రమల్లో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఇద్దరు ముగ్గురు టాప్ హీరోలను ఒకే సినిమాలో నటింపజేయడం కారణంగా సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ అందుకుంటుందని ఆయా దర్శకనిర్మాతల ఆలోచన. అది కొంత మేరకు వాస్తవం అనే చెప్పాలి. అయితే ఇప్పటికే ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ తను ఎవరితో మల్టీస్టారర్ సినిమా చేయాలి అనే విషయాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు

    మళ్లీ ప్రమోషన్‌

    మళ్లీ ప్రమోషన్‌

    దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అందరి చూపు RRR: రౌద్రం రణం రుధిరం పై ఉంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి సినిమా విడుదల కాబోందని అన్ని భాషల్లోనూ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేశారు. కానీ ఊహించని విధంగా సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు.

    పక్కకు తీసేశా

    పక్కకు తీసేశా

    తాజాగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి మంగళవారం తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ ఇంటరాక్షన్ లోనే ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య బ్యాలన్స్ పాటించారా?' అని రాజమౌళిని ప్రశ్నించగా... "ఇద్దరికీ ఎంత స్క్రీన్ స్పేస్ ఉంది? ఆ హీరోకి ఎన్ని ఫైట్స్ ఉన్నాయి? ఈ హీరోకి ఎన్ని ఫైట్స్ ఉన్నాయి? ఎవరు ఎన్ని పంచ్ డైలాగ్స్ కొట్టారు? వంటి లెక్కలను నేను పక్కకు తీసేశా అని అన్నారు.

    ఆవేశానికి గురై

    ఆవేశానికి గురై

    ఒక్క సెకన్ కూడా ఆ విషయాల గురించి ఆలోచించలేదు. చాలా ఎక్కువ ఆలోచించింది ఏంటంటే... ప్రేక్షకుల్లో ఇద్దరిపై ఒకే విధమైన ఎంపతీ రావాలి. ఇద్దరి గురించి ఒకే విధంగా ఆలోచించాలి. ఒకేలా ఫీలవ్వాలి. సినిమా మొదలై, ఇద్దరి ఇంట్రడక్షన్స్ పూర్తి అయిన తర్వాత ఇద్దరి పాత్రలకు క్లోజ్ అవుతారు. స్టార్స్‌గా ఆల్రెడీ వాళ్ళు ప్రేక్షకులు క్లోజ్" అని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ అంశం మీద ఎన్టీఆర్‌ రియాక్ట్ అయ్యారు.

    హృదయం లేని సినిమా

    హృదయం లేని సినిమా

    తొలుత మాట్లాడుతూ కాస్త ఆవేశానికి గురైన ఎన్టీఆర్‌ మల్టీస్టారర్‌ చిత్రాలకు కొత్త అర్థాన్ని చెప్పారు. అంతేకాదు మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తూనే ఉంటాయన్నారు. ఇలాంటి చిత్రాల్లో హీరోలు తమ పాత్రల నిడివి గురించి ఆలోచించడం లేదన్నారు. అభిమానులు కూడా నిడివిని పట్టించుకోవడం మానేశారని, ఇద్దరు హీరోలు కలిసి ఉంటె చూడాలని ఫిక్స్ అయ్యారని చెప్పారు. అసలు లెక్కలు వేసుకుని తీస్తే... హృదయం లేని సినిమా తీస్తామని అన్నారు.

    Recommended Video

    Jr NTR As Peddi | Exciting Updates On NTR 31 | Filmibeat Telugu
    వాళ్ళతో సినిమా చేస్తా

    వాళ్ళతో సినిమా చేస్తా

    ప్రేక్షకులు ఆ పాత్ర నవ్వితే నవ్వాలి, ఏడిస్తే ఏడవాలని, అప్పుడే మంచి సినిమా వస్తుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు. కేవలం ఎన్టీఆర్‌ని కాదు, ఓన్లీ చరణ్‌ను కాదు... ఇద్దరినీ కలిసి చూడబోతున్నామని మానసికంగా సిద్ధమయ్యారు. ఈ రోజు మన దర్శకులు, మన సినిమా, మనం ఆ స్థాయి దాటేశామని నమ్ముతున్నాను. అవి దాటి ముందుకు వెళ్ళిపోయాం" అని చెప్పారు. తనకు మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్... చిరంజీవి, బాలా బాబాయ్, నాగార్జున, వెంకటేష్ అందరితో మల్టీస్టారర్ సినిమాలు చేయాలని ఉందని ఎన్టీఆర్ తెలిపారు.

    English summary
    jr ntr intresting comments on multi starrer movies
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X