40డిగ్రీల ఎండలో చెప్పులు లేకుండా.. కొమురం భీముడొ పాటకు నిజంగానే శిక్ష అనుభవించిన తారక్!

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను అందుకున్న మరొక పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా టాప్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దర్శక ధీరుడు రాజమౌళి మరొకసారి తన పనితనాన్ని చూపించి బాలీవుడ్ సినీ ప్రముఖులను కూడా ఆశ్చర్యపరిచాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ కూడా ఆ సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టారు. మొత్తానికి వారికి కూడా ఒక మంచి మార్కెట్ లభించింది అని చెప్పవచ్చు.

ఈ సినిమా కోసం రామ్ చరణ్ తేజ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసినట్లుగా సినిమా చూస్తే అర్థం అయింది. అంతేకాకుండా సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా రాజమౌళి పెట్టిన కష్టం గురించి చాలా సరదాగా వివరణ ఇచ్చారు. మొత్తానికి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ పడిన కష్టానికి అయితే ఈ సినిమా తగిన ఫలితాన్ని ఇచ్చింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కాస్త తక్కువగా చూపించారు అని ఓ వర్గం నుంచి టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ అలాంటి వారికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒకే ఒక్క పాటతోనే సమాధానం చెప్పాడు. కొమురం భీముడొ పాట సినిమాలో చాలా హైలెట్గా నిలిచింది. ఒక విధంగా రామ్ చరణ్ ఆ సీన్ లో జూనియర ఎన్టీఆర్ ను కొడుతూ ఉంటే చూపించిన హావభావాలు చాలా హైలెట్ గా నిలిచాయి.

Jr NTR komuram bheemudo song behind the hard work

అయితే ఆ పాటకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం కూడా ఇప్పుడు బయటపడింది. సినిమాకు సంబంధించిన కొమురం భీముడొ వీడియో సాంగ్ ను ఈ రోజు విడుదల చేశారు. ఇక విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్లో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. ఇక ఆ పాటకు కష్టపడిన ఒక విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఆ పాటకు పడిన కష్టం అంతా ఇంతా కాదట. దాదాపు 47 డిగ్రీల ఎండలో ఎన్టీఆర్ ఆ సన్నివేశంలో చెప్పులు లేకుండా నటించాల్సి వచ్చింది. దాదాపు 600 మంది ఆ షూటింగ్లో పాల్గొన్నారు.

ఒక విధంగా ఎన్టీఆర్ కొమరం భీముడో పాత్ర ఎదుర్కొన్న కష్టం కూడా రియల్ షూటింగ్ లో ఎన్టీఆర్ చూసినట్లు అనిపించింది అని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ పాటకు ముందు రీహార్సల్స్ కోసం దాదాపు 20 రోజుల వరకు ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక షూటింగ్ 15 రోజుల వరకు చిత్రీకరించినట్లు సమాచారం. ఒక విధంగా ఎన్టీఆర్ నటించిన విధానం నేటితరం నటీనటులకు కూడా ఒక పాఠంలా నిలుస్తుంది అని చూపించవచ్చు. అందులో చూపించిన హావా భావాలు అతని టాలెంట్ ఎలాంటిదో మరోసారి నిరూపించాయి. ఒక విధంగా కమర్షియల్ గానే కాకుండా నటుడిగా కూడా ఎన్టీఆర్ స్థాయి మరో లెవెల్ కి వెళ్ళింది అని చెప్పవచ్చు. హిందీ ఆడియెన్స్ కూడా ఆ పాటకు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. మరి తదుపరి సినిమాతో ఎన్టీఆర్ కనిపిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X