Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తప్పిన జూనియర్ ఎన్టీఆర్ అంచనా: భారీ ప్రాజెక్టు ప్రారంభానికి మరింత ఆలస్యం
కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఏకంగా ఐదు హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి రూపిందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో అతడు తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీంగా నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు. అందులో కొరటాల శివ రూపొందించే సినిమా కూడా ఒకటి ఉంది.
RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమాను ఇటీవలే ప్రకటించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను జూన్ నుంచి ప్రారంభించబోతున్నట్లు కూడా వెల్లడించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యూలర్ షూటింగ్ ఆలస్యం కాబోతుందట. దీనికి కారణం కరోనా వల్ల వీళ్లిద్దరూ చేస్తున్న చిత్రాల షూటింగులు వాయిదా పడిపోవడమేనని తెలిసింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ RRR షూటింగ్ చేయాల్సి ఉంది. అలాగే, కొరటాల శివ 'ఆచార్య' కొంత బ్యాలెన్స్ ఉంది. ఈ రెండూ పూర్తయిన తర్వాతనే కొత్త సినిమాను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, అవి రెండూ ప్రస్తుతానికి ఆగిపోయాయి. అంతేకాదు, ఎప్పుడు పున: ప్రారంభం అవుతాయో కూడా తెలీదు. సో.. ఎన్టీఆర్ 30వ సినిమాపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్‌తో యూనివర్శల్ కాన్సెప్టుతో ఇది రూపొందనుంది.