Devara Advance Booking: దేవర రిలీజ్ ముందే రికార్డు కలెక్షన్స్.. ఓవర్సీస్ లో ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కొట్లంటే?

కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తుండగా.. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ -1 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎన్టీఆర్ తన క్యారెక్టర్‌‌ వరకు షూటింగ్‌ను రీసెంట్‌గానే పూర్తి చేసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇటీవలే తన తల్లి షాలిని, భార్య ప్రణీతతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఉడిపి శ్రీకృష్ణ మఠంతో పాటు మాడగల్లులోని కేశవనాథేశ్వర ఆలయం, కొల్లూరు మూకాంబికా ఆలయాలను ఎన్టీఆర్ సందర్శించారు. జూనియర్ ఎంట కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఉన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వర్షాలు , వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులకు ఎన్టీఆర్ బాసటగా నిలిచారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షల చొప్పున విరాళంగా ప్రకటించారు.

Jr NTR koratala siva s Devara creates record in Advance Sales For Premiere for north america here s the details

ఇక దేవర విషయానికి వస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ట్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఈ మూవీకి రూ.300 కోట్ల వరకు నిర్మాణ వ్యయం అయినట్లుగా తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనే దేవర రూ.125 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. నైజాంలో రూ.45 కోట్లు, ఆంధ్రాలో రూ.55 కోట్లు, సీడెడ్‌లో రూ.25 కోట్లు వ్యాపారం జరిగినట్లు వినికిడి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.200 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నాన్ థియేట్రికల్ బిజినెస్ సంగతి చూస్తే.. దేవర డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.155 కోట్లకు దక్కించుకున్నట్లుగా సమాచారం. శాటిలైట్ రైట్స్ రూ.75 కోట్లకు, ఆడియో రైట్స్ రూ.33 కోట్లకు అమ్ముడైనట్లు ఫిలింనగర్ టాక్. అంటే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలుపుకుని దేవర దాదాపు రూ.450 కోట్లకు పైనే బిజినెస్ చేసిందని అంటున్నారు.

Jr NTR koratala siva s Devara creates record in Advance Sales For Premiere for north america here s the details

సెప్టెంబర్ 27న దేవర రిలీజ్‌ నేపథ్యంలో ఇప్పటికే ఓవర్సీస్‌లోని కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికాలో రిలీజ్‌కు నెల రోజుల ముందే ప్రీమియర్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. నార్త్ అమెరికాలో (అమెరికా, కెనడా) ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దేవరకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఈ రెండు చోట్లా 40 లోకేషన్లలో 100 షోలకు గాను ఇప్పటి వరకు ప్రీ సేల్స్ ద్వారానే 2,01,320 డాలర్లు (భారత కరెన్సీలో ఒక కోటి 69 లక్షల 7 వేల 316 రూపాయలు) వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇంకా సినిమా రిలీజ్‌కు 23 రోజులు ఉండటంతో దేవర ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

More from Filmibeat

Read more about: jr ntr koratala siva devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X