నేషనల్ రికార్డ్: ఐదోది కూడా పూర్తి చేస్తున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ ఇది.

By Manoj

నందమూరి తారక రామారావు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు అతడు ఎంతగానో శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధ పడే తారక్.. ప్రస్తుతం నటిస్తున్న RRR కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తద్వారా నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేస్తున్నాడు. ఆ వివరాలు మీకోసం..

ఇప్పటి హీరోలెవరికీ దక్కని రికార్డ్‌కు చేరువ

ఇప్పటి హీరోలెవరికీ దక్కని రికార్డ్‌కు చేరువ

జూనియర్ ఎన్టీఆర్.. కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘టెంపర్' సినిమాను మొదలుకుని అతడు వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఇప్పటి హీరోలు ఎవరికీ సాధ్యం కాని డబుల్ హ్యాట్రిక్‌కు చేరువయ్యాడు.

తారక్‌ను రియల్ హీరోను చేసిన దర్శకధీరుడు

తారక్‌ను రియల్ హీరోను చేసిన దర్శకధీరుడు

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే అతడు దర్శకధీరుడు తెరకెక్కిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ మూవీలో తారక్.. కొమరం భీంగా, చెర్రీ.. అల్లూరిగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.

ఆ విషయంలో ఫ్యాన్స్‌ను నిరాశ పరిచాడు

ఆ విషయంలో ఫ్యాన్స్‌ను నిరాశ పరిచాడు

ఇప్పటి వరకు ఏడాది ఒక్క సినిమానైనా తీసుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే, RRR పుణ్యమా అని ఈ సారి అది సాధ్యం కాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత' తర్వాత అతడు నటించిన మరో సినిమా విడుదల కాలేదు. RRR 2021లో రానుంది. అంటే కచ్చితంగా రెండేళ్లు తారక్ సినిమా రావట్లేదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

ఎన్నో జాగ్రత్తలు.. సంచలన నిర్ణయాలు

ఎన్నో జాగ్రత్తలు.. సంచలన నిర్ణయాలు

భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రాబోతున్న RRR కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. లుక్, ఫిజిక్ విషయంలో చాలా నియమాలు పాటిస్తున్నాడు. వీటితో పాటు ఎంట్రన్స్ సీన్ కోసం రియల్ పులితో ఫైట్, క్లైమాక్స్ కోసం గుండు చేయించుకోవడం వంటి కొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

 ఇండియాలోనే మొదటి హీరోగా ఎన్టీఆర్ రికార్డ్

ఇండియాలోనే మొదటి హీరోగా ఎన్టీఆర్ రికార్డ్

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ సర్‌ప్రైజ్ వీడియోను విడుదల చేయించిన విషయం తెలిసిందే. ‘భీమ్ ఫర్ రామరాజు' అనే పేరుతో వచ్చిన ఈ వీడియో కోసం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అతడు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మలయాళంలో మాత్రం వేరే వాళ్లు చెప్పారు. దీంతో ఒకే సినిమా కోసం 4 భాషల్లో డబ్బింగ్ చెప్పిన మొదటి హీరోగా నిలిచాడు.

Recommended Video

Ajay Devgn Look From RRR On His birthday, Missed Due To Lockdown
 నేషనల్ రికార్డ్: ఐదోది కూడా పూర్తి చేస్తున్నాడు

నేషనల్ రికార్డ్: ఐదోది కూడా పూర్తి చేస్తున్నాడు

తాజాగా తారక్ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం... RRR ఐదు భాషల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ ఐదు భాషల్లోనూ అతడు డబ్బింగ్ చెప్పబోతున్నాడట. ఇందులో భాగంగానే కష్టంగా ఉండే మలయాళం భాషను కొద్ది రోజులుగా నేర్చుకుంటున్నాడని తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X