ఆ స్టార్ హీరోతో ఎన్టీఆర్ సీక్రెట్ మీటింగ్: ఎందుకు కలిశారో తెలిస్తే.. సంచలనంగా మారిన ఫొటో

గతంలో కంటే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లోని హీరోల మధ్య సంబంధాలు మరింతగా బలపడుతున్నాయి. ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేయడం, ఒక హీరో ఫంక్షన్‌కు ఇంకో హీరో గెస్టుగా రావడం, మూవీలు బాగుంటే ప్రశంసించడం, కష్టాల్లో ఉంటే ధైర్యం చెప్పడం వంటి వాటి వల్ల హీరోలు మరింత క్లోజ్ అవుతున్నారు.

దీంతో వాళ్ల వాళ్ల అభిమానులు కూడా దగ్గరవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక అడుగు ముందుకేసి మరీ మరో స్టార్ హీరోతో సమావేశం అయ్యాడు. ఆ వివరాలను మీరే చూడండి!

Jr NTR Met Allu Arjun At Pushpa The Rule Sets

కొరటాల సినిమాతో తారక్ బిజీ: జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది చాలా లేట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ చిత్రాన్ని ఇటీవలే మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా షెడ్యూళ్లను జరుపుకుంటూ వస్తున్నారు.

Jr NTR Met Allu Arjun At Pushpa The Rule Sets

పుష్పగా రూల్ చేయాలని బన్నీ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప ది రూల్'లో నటిస్తున్నాడు. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని మొదటి భాగం కంటే హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సగానికి పైగా షూటింగ్ పూర్తైంది. త్వరలోనే మిగిలిన భాగాన్ని పూర్తి చేయబోతున్నారు.

Jr NTR Met Allu Arjun At Pushpa The Rule Sets

ఇద్దరూ ఒకేచోట.. పోరాటాలతో: ఇటు జూనియర్ ఎన్టీఆర్, అటు అల్లు అర్జున్ నటిస్తోన్న రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్‌లు హైదరాబాద్ నగర శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుతున్నారు. ఇందుకోసం రెండు చిత్రాల యూనిట్‌లు రెండు వేరే వేరు భారీ సెట్‌లను ఏర్పాటు చేశాయి. వీటిలోనే ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ సినిమాలకు సంబంధించిన యాక్షన్ పార్టులో పాల్గొంటున్నారు.

అల్లు అర్జున్‌ను కలిసిన తారక్: పుష్ప ది రూల్ మూవీ కోసం అల్లు అర్జున్, కొరటాల శివ సినిమా కోసం ఎన్టీఆర్ కొంచెం కూడా విరామం తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. తమ తమ సినిమాల కోసం చెమటోడ్చుకుంటూ కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తారక్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సమావేశం అయ్యాడు. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే హాట్ టాపిక్‌గా మారింది.

Jr NTR Met Allu Arjun At Pushpa The Rule Sets

వాళ్లిద్దరితో సరదాగా ముచ్చట్లు: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ మూవీ కోసం యాక్షన్ సీక్వెన్స్ షూట్‌లో పాల్గొంటున్నాడు. ఈ సెట్స్‌కు సమీపంలోనే ఉన్న 'పుష్ప ది రూల్' బృందాన్ని అతడు తాజాగా కలిశాడు. ఆ సమయంలో బన్నీతో పాటు సుకుమార్‌తో తారక్ చాలా సేపు మాట్లాడినట్లు తెలిసింది. పక్కపక్కనే ఉండడం వల్లే వీళ్లిద్దరూ కలిశారట. అంతకు మించి ఈ మీటింగ్ వెనుక ఏమీ లేదని టాక్.

Jr NTR Met Allu Arjun At Pushpa The Rule Sets

ఎన్టీఆర్ ఫొటో.. ఫ్యాన్స్ ఖుషీగా: అల్లు అర్జున్‌ను కలవడానికి వెళ్లిన సమయంలో ఎన్టీఆర్ వైట్ కలర్ క్యాజువల్ షర్ట్‌ను ధరించాడు. దీనికి సంబంధించిన ఫొటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా ఈ న్యూస్ బయటకు రావడంతో అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే, వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కూడా వదలాలంటూ కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X