For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తమిళ స్టార్ హీరోతో ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్: యంగ్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఈ మధ్యనే ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం ఆ తరహాలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అవడమే. అందుకే ఇప్పటి తరం హీరోలు ఇగోలను పక్కన పెట్టేసి మరీ అలా సినిమాల్లో నటించేందుకు ముందుకు వస్తున్నారు. ఫలితంగా అలాంటివి ఎన్నో పట్టాలెక్కేస్తున్నాయి. ఇందులో భాగంగానే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్‌కు పచ్చజెండా ఊపేశాడట. అయితే, ఇది తెలుగు హీరోతో కాదు.. తమిళంలో నెంబర్ వన్‌ ప్లేస్‌లో ఉన్న స్టార్‌తో. అసలేంటీ మూవీ కథ? పూర్తి వివరాలు మీకోసం!

  టాలీవుడ్‌లోనే భారీ మల్టీస్టారర్ మూవీలో

  టాలీవుడ్‌లోనే భారీ మల్టీస్టారర్ మూవీలో

  టాలీవుడ్ చరిత్రలోనే భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). రాజమౌళి రూపొందిస్తోన్ ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో చరణ్.. అల్లూరిలా, ఎన్టీఆర్.. కొమరం భీంలా నటిస్తున్నారు. ఆలియా, ఒలీవియా హీరోయిన్లు.

   ఆ సినిమా అలా ఆపేయాల్సి వచ్చిందిగా

  ఆ సినిమా అలా ఆపేయాల్సి వచ్చిందిగా

  RRR మూవీ పట్టాలపై ఉండగానే జూనియర్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్‌తో ఇది వస్తుందని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాలనుకున్న ఈ సినిమా ప్రకటనకే పరిమితం అయింది. అయితే, భవిష్యత్‌లో ఈ కాంబో ఉంటుందని అంటున్నారు.

  కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్

  కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్

  ఎన్టీఆర్ 30వ సినిమాను త్రివిక్రమ్‌తో కాదని.. కొరటాల శివతో చేస్తున్నాడు. ‘జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో మూవీ రాబోతుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

  ప్రశాంత్ నీల్, బుచ్చిబాబుతో సినిమాలు

  ప్రశాంత్ నీల్, బుచ్చిబాబుతో సినిమాలు

  RRR మూవీ షూటింగ్ పూర్తవక ముందే తన సినిమాల లైన్‌ను ఫిక్స్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇందులో భాగంగానే కొరటాలతో 30వ సినిమాను.. ప్రశాంత్ నీల్‌తో 31వ సినిమాను.. త్రివిక్రమ్‌తో 32వ సినిమాను చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇంతలో ‘ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు కూడా లైన్‌లోకి వచ్చాడు. అతడితో ఓ స్పోర్ట్స్ డ్రామాను చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు తారక్.

  తమిళ స్టార్‌తో ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్

  తమిళ స్టార్‌తో ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్

  ఎన్టీఆర్ గురించి రోజుకో వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అతడి గురించి మరో న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్‌తో కలిసి ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ చేయనున్నాడట. ఇది మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుందని అంటున్నారు. ఈ న్యూస్ కోలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది.

  Akhanda Vs Acharya Vs Narappa, హీరోల లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా !
  ఒక్క దెబ్బకు ఇద్దరికీ ఇచ్చేయాలని ప్లాన్

  ఒక్క దెబ్బకు ఇద్దరికీ ఇచ్చేయాలని ప్లాన్

  పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చే ఈ మల్టీస్టారర్ మూవీని యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించనున్నాడట. వాస్తవానికి ఎన్టీఆర్, విజయ్ ఇద్దరితోనూ సినిమాలకు కమిట్ అయ్యాడతను. ఇప్పుడు ఇద్దరినీ ఒకేసారి డీల్ చేయాలని అదిరిపోయే ప్లాన్ వేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ షారూఖ్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దీని తర్వాత మల్టీస్టారర్ వస్తుందని టాక్.

  English summary
  Jr NTR is most likely to return to the small screen as a host for the upcoming season of Meelo Evaru Koteeswarudu, the Telugu version of Amitabh Bachchan's Kaun Banega Crorepati. The show is expected to hit the floors in February, 2021. Further details of the show are awaited at the moment.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X