Jr NTR Net Worth: దేవర తర్వాత జూ ఎన్టీఆర్ ఆస్తుల విలువ ఎంత? ఎన్ని కోట్ల విలువైన సంపద అంటే?
అన్న నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా దూసుకెళ్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ జనరేషన్‌లో నవరసాలను అద్భుతంగా పలికించగల.. సింగిల్ టేక్‌లో ఎంతటి క్లిష్టమైన షాట్‌నైనా ఓకే చేయగల అరుదైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవరతో ఎన్టీఆర్ పేరు మరోసారి మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత వివరాలు, సినిమాలు, రెమ్యునరేషన్ తదితర అంశాల్లోకి వెళితే..
20-5-1983న నందమూరి హరికృష్ణ - శాలిని దంపతులకు జన్మించారు ఎన్టీఆర్. నటన, ఆహార్యం, వాక్చాతుర్యం ఇలా అన్నింటిని తాత నుంచి పుణికి పుచ్చుకున్నారు జూనియర్. తాతయ్య ఒడిలోనే నటనలో ఓనమాలు నేర్చుకున్న ఎన్టీఆర్.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణంలో అద్భుతంగా నటించి ప్రశంసలు దక్కించుకున్నారు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న ఎన్టీఆర్.. దేశంలోని పలు ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు . అయితే పెద్దల సలహాతో చదువుపై దృష్టి పెట్టిన తారక్ .. తిరిగి నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

ఆ వెంటనే స్టూడెంట్ నెం.1, సింహాద్రి, ఆది సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ కావడంతో చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకున్నారు తారక్. అయితే ఈ జోరును ఆయన కొనసాగించలేకపోయారు. మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో రేసులో కాస్త వెనకబడ్డారు. ఈ దశలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగతో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యారు ఎన్టీఆర్.
ఆ వెంటనే అదుర్స్, బృందావనం సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్‌తో ఎన్టీఆర్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఆ వెంటనే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ తనకు తిరుగులేదని నిరూపించారు.
సెప్టెంబర్ 27న ఆయన నటించిన దేవర సినిమా విడుదలైన నేపథ్యంలో ఎన్టీఆర్ పేరు మారుమోగుతోంది. సినిమాకు రూ.30 నుంచి రూ.40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే తారక్.. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు .
ఎన్టీఆర్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది. దాని విలువ రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇది కాక ఇటీవల బెంగళూరులో ఓ ఇల్లు, హైదరాబాద్ శంకరపల్లిలో ఓ ఫాంహౌస్‌ను కొనుగోలు చేశారు ఎన్టీఆర్. దీనికి బృందావనం అని తన సినిమా పేరు పెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. ఇవి కాకుండా పలు వ్యాపారాల్లోనూ, రియల్ ఎస్టేట్‌లోనూ తారక్ రూ. కోట్లలో పెట్టుబడులు పెట్టినట్లుగా చెబుతారు.
ఇక కార్లంటే పడిచచ్చిపోయే ఎన్టీఆర్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. రూ. కోటిన్నర విలువైన పోర్సే 911, రూ.2.5 కోట్ల విలువై రేంజ్ రోవర్ , కోటిన్నర విలువైన బెంజ్ 4 మెటిక్‌తో పాటు రూ.కోట్లు విలువైన వాచ్‌లు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఎన్టీఆర్ ఆస్తులు రూ.500 కోట్ల పైమాటే. సినిమాకు రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటాను తీసుకుంటారు. ఆయన ఇలాగే మరిన్ని సూపర్‌హిట్ సినిమాల్లో నటించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఫిల్మీ బీట్ కోరుకుంటోంది


Click it and Unblock the Notifications











