NTR అన్న కోసం అదిరిపోయే ప్లాన్: నిర్మాతలకు కండీషన్స్.. దానికి ఒప్పుకుంటేనే సినిమాలు

కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ కెరీర్‌లోనే సూపర్ డూపర్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఒకదాని తర్వాత ఒకటి ఇలా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం వరుసగా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తారక్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. అతడు సినిమా ఒప్పుకోవాలంటే కొత్త కండీషన్స్ పెడుతున్నాడట. వాటికి ఒప్పుకుంటేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని తెలిసింది. ఆ సంగతులు మీకోసం!

ఏకంగా ఐదు హిట్లతో ఎన్టీఆర్ దూకుడు

ఏకంగా ఐదు హిట్లతో ఎన్టీఆర్ దూకుడు

చాలా రోజుల పాటు వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడిన జూనియర్ ఎన్టీఆర్.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి విజయాల బాట పడ్డాడు. ఆ ఆడియో వేడుకలో ఫ్యాన్స్‌ కాలర్ ఎత్తుకునేలా సినిమాలు చేస్తానని చెప్పిన తారక్.. అప్పటి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లతో సత్తా చాటాడు.

ప్రతిష్టాత్మక చిత్రంలో భాగమైన ఎన్టీఆర్

ప్రతిష్టాత్మక చిత్రంలో భాగమైన ఎన్టీఆర్

టాలీవుడ్ హిస్టరీలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). రాజమౌళి రూపొందిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నారు. డీవీవీ దానయ్య దీన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చరణ్.. అల్లూరి గానూ, ఎన్టీఆర్.. కొమరం భీంలా నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా హీరోయిన్లు.

కోటీశ్వరులను చేసేందుకు వస్తున్నాడు

కోటీశ్వరులను చేసేందుకు వస్తున్నాడు

వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ 'బిగ్ బాస్' షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. హోస్టుగా తొలి ప్రయత్నమే అయినా ఏమాత్రం జంకకుండా షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపాడు. దీని తర్వాత గ్యాప్ తీసుకున్న తారక్.. త్వరలోనే ప్రారంభం కాబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షోతో బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

ఆయనతో సినిమా.. అలా ఆగిపోయింది

ఆయనతో సినిమా.. అలా ఆగిపోయింది

RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. రాధాకృష్ణ, కల్యాణ్ రామ్ నిర్మించే ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ కూడా ప్రచారం అయింది. కొద్ది రోజుల్లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగింది. ఇంతలోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు వెల్లడించారు.

30వ సినిమాను ఆయనతో ప్లాన్ చేస్తూ

30వ సినిమాను ఆయనతో ప్లాన్ చేస్తూ


త్రివిక్రమ్‌తో తన 30వ సినిమాను చేయాలని భావించిన ఎన్టీఆర్.. అది సాధ్యం కాకపోవడంతో కొరటాల శివను లైన్‌లోకి తీసుకు వచ్చాడు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత వీళ్ల కాంబోలో మూవీ వస్తుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతుంది.

 అనుకున్నట్లుగానే 31వ సినిమా అనౌన్స్

అనుకున్నట్లుగానే 31వ సినిమా అనౌన్స్

మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని అతడు నటించబోయే 31వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అందరూ అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.

Recommended Video

Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
అన్న కోసం ఎన్టీఆర్ అదిరిపోయే ప్లాన్

అన్న కోసం ఎన్టీఆర్ అదిరిపోయే ప్లాన్

ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఎన్టీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నాడని ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. తాను చేయబోయే ప్రతి సినిమాకు కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. ఇప్పటికే కొరటాల, ప్రశాంత్ చిత్రాలకు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఈ కండీషన్‌కు ఒప్పుకుంటేనే సినిమాలు చేస్తానని తారక్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X