ఉప్పెన దర్శకుడితో ఎన్టీఆర్.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోయేది ఆ రోజే!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. వీలైనంతవరకు మంచి టాలెంటెడ్ దర్శకులతో వారికి నచ్చినట్లుగా కథలను కూడా సిద్ధం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే RRR సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ప్రభాస్ తరహాలోనే వరుసగా అతిపెద్ద పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టే విధంగా అడుగులు వేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక ఈ సినిమా ప్రమోషన్స్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమాకు సంబంధించిన ఒక ఎనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాకు సంబంధించిన సెకండ్ ఇన్నింగ్స్ ప్రమోషన్స్ లో బిజీ కాబోతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి రావల్సిన ఈ సినిమా అనుకోకుండా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక మార్చి 25 వ తేదీన ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ సెన్సార్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. ఇక సినిమాలో విడుదల చేయడమే ఆలస్యం. ఈ సినిమా కోసం ప్రేక్షకులు గత ఏడాది నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతుంది.

అయితే RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కొరటాల శివ సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి సందేశంతో తెరకెక్కబోతుంది. ఇదివరకే వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అదే తరహాలో మంచి కాన్సెప్ట్ తో దర్శకుడు కొరటాల శివ కథను రెడీ చేసుకున్నాడు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ మరొక సినిమాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో ఇదివరకే ఒక కథ పై చర్చలు జరిపిన ఎన్టీఆర్ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవ్వడంతో అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాడు.
ఇక అందుకు సంబంధించిన తేదీ కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన మైత్రి మూవీ మేకర్స్ బుచ్చిబాబు కలయికలో సినిమా చేయబోతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. బుచ్చి బాబు కు మధ్యలో చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ అతని ఫోకస్ మొత్తం ఎన్టీఆర్ తో వర్క్ చేయాలి అనే ఆలోచనతోనే తిరుగుతోంది. ముందు నుంచి ఎన్టీఆర్ తో అతనికి మంచి పరిచయం ఉండడంతో ఈ కాంబినేషన్ సెట్ అవడానికి ఉపయోగపడింది. మరి బుచ్చిబాబు ఎన్టీఆర్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











