Jr NTR: గొప్ప మనసు చాటుకున్న ఎన్టీఆర్.. నేరుగా అభిమానికి ఫోన్.. మొబైల్ నెంబర్‌ వైరల్

లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్లతో టాప్ స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. టీనేజ్‌లోనే ఇండస్ట్రీ హిట్లను అందుకున్న అతడు.. అప్పటి నుంచి టాలీవుడ్‌లో హవాను చూపిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. వాళ్లను కాలర్ ఎత్తుకుని తిరిగేలా సినిమాలు చేస్తానని మాటిచ్చిన ఈ నందమూరి హీరో.. అందుకు అనుగుణంగానే వరుసగా హిట్లను సొంతం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్.. అనారోగ్యంతో బాధ పడుతోన్న తన అభిమానికి నేరుగా ఫోన్ చేసి గొప్ప మనసును చాటుకున్నాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌తో ఎన్టీఆర్

వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌తో ఎన్టీఆర్

ఆ మధ్య కొంత కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ‘టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' విజయాలను సొంతం చేసుకున్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా గణనీయంగా పెరిగిందనే చెప్పాలి.

RRRతో తారక్ పాన్ ఇండియా స్టార్‌గా

RRRతో తారక్ పాన్ ఇండియా స్టార్‌గా


వరుస హిట్లతో సత్తా చాటుతోన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అదే సమయంలో ఎన్టీఆర్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి పాన్ ఇండియా స్టార్‌ను చేసింది.

కొరటాలతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం

కొరటాలతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం

డబుల్ హ్యాట్రిక్ హిట్లతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన, గ్లిమ్స్ వీడియో కూడా వచ్చాయి. దీన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను జూలై నుంచి మొదలు పెట్టబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

కేజీఎఫ్ దర్శకుడితో తారక్ సినిమా

కేజీఎఫ్ దర్శకుడితో తారక్ సినిమా

జూనియర్ ఎన్టీఆర్ RRR మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే మరో దర్శకుడికి కూడా పచ్చజెండా ఊపేశాడు. అతడే.. కేజీఎఫ్‌తో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రశాంత్ నీల్. వీళ్లిద్దరి కాంబోలో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే రాబోతుంది. ఇది ఈ ఏడాది చివర్లో మొదలు కానుంది.

అభిమానికి నేరుగా ఫోన్ చేసిన హీరో

అభిమానికి నేరుగా ఫోన్ చేసిన హీరో

ఎంతటి స్టార్ హీరో అయినా జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల పట్ల ప్రేమానురాగాలను చూపిస్తూనే ఉంటాడు. గతంలో ఎన్నో సందర్భాల్లో ఫ్యాన్స్ కోసం ఎన్నో మంచి పనులు చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అనారోగ్యంతో బాధ పడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న జనార్థన్ అనే అభిమానికి ఎన్టీఆర్ నేరుగా ఫోన్ కాల్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ధైర్యం చెప్పిన తారక్.. ప్రామిస్ చేసి

జనార్థన్ పరిస్థితి తెలుసుకున్న ఎన్టీఆర్.. తన అభిమాన సంఘ సభ్యుల ద్వారా అతడి తల్లితో మాట్లాడాడు. ‘అమ్మా.. మీరు ధైర్యంగా ఉండండి. ఆ దేవుడి మన వెంటనే ఉంటాడు. మీ బిడ్డకు ఏమీ జరగదు. అతడు త్వరలోనే కోలుకుని వస్తాడు' అని ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత జనార్థన్‌తో లౌడ్ స్పీకర్ ద్వారా సంభాషిస్తూ కోలుకున్నాక స్వయంగా కలుస్తానని ప్రామిస్ చేశాడు.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ అంటూ వైరల్

ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ అంటూ వైరల్


ఇదిలా ఉండగా.. జనార్థన్ తల్లితో ఎన్టీఆర్ మాట్లాడుతోన్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో అందులో మొబైల్ నెంబర్‌ను హైలైట్ చేసిన నందమూరి అభిమానులు.. ఇది ఎన్టీఆర్‌దే అంటూ తెగ వైరల్ చేస్తున్నారు. అయితే, కొంత మంది మాత్రం ఇది తారక్ నెంబర్ కాదని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడిది హాట్ టాపిక్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X