Jr NTR: జపాన్ లో మెగాస్టార్ టాలెంట్ పై ఎన్టీఆర్ కామేంట్.. ఏమన్నాడంటే?
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా RRR సినిమాతో ఎంత మంచి స్నేహితులో అర్థం అయిపోయింది. ఆ సినిమా ప్రమోషన్ లో ఇద్దరు కూడా ఒక సాధారణ మిత్రులు ఏ విధంగా ఉంటారో అదే విధంగా కనిపించారు. అయితే వారిద్దరి స్నేహం కూడా ఆదే సినిమాతో మొదలయ్యింది అని అందరూ అనుకున్నారు. కానీ అంతకంటే ముందే మేము చాలా ఏళ్ళ క్రితం నుంచి స్నేహితులుగా ఉన్నాము అంటూ ఎన్టీఆర్ చాలా ఇంటర్వ్యూలలో తెలియజేశాడు.
అలాగే రాంచరణ్ కూడా తమ స్నేహాన్ని ఎక్కువగా బయటకు చూపించుకోవాలని అనుకోలేదు అని కూడా అన్నాడు. దీంతో మెగా నందమూరి హీరోల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అభిమానులకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక RRR సినిమాతో ఆ బంధం గురించి ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇక వీరిద్దరిని వెండితెర పైకి తీసుకువచ్చిన రాజమౌళి పై కూడా ప్రశంసలు కురిపించారు. రీసెంట్ గా RRR సినిమాను జపాన్లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా అక్కడ కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకుంది. అంతేకాకుండా సినిమా విడుదలకు ముందు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే రాజమౌళి ముగ్గురు కూడా అక్కడ రెగ్యులర్ ప్రమోషన్ లో పాల్గొన్నారు. మీడియాతో కూడా ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతూ సినిమా గురించి అలాగే జపాన్ దేశం గురించి కూడా వాళ్ళు వివిధ రకాలుగా మాట్లాడారు.
అయితే ఈ తరుణంలో తెలుగు చిత్ర పరిశ్రమ గురించి జూనియర్ ఎన్టీఆర్ అక్కడ వివరణ ఇవ్వడం విశేషం. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంచి నటులు ఉన్నారు అని ముఖ్యంగా చరణ్ నాన్నగారు టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప డాన్సర్ అని కూడా చెప్పడం విశేషం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరోల మధ్య అనుబంధం గురించి కూడా ఫ్యాన్స్ ఇంకా బాగా అర్థం చేసుకోవాలని కొందరు అభిమానులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











