తారక్ కుటుంబం పెద్దదైంది.. ఇది కూడా రికార్డే.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Recommended Video

Jr NTR Achieves Rare Feat || Filmibeat Telugu

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదే ఉత్సాహంతో ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'RRR'లో నటిస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్ కొమరం భీంగా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తారక్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. వివరాల్లోకి వెళ్తే...

 సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

జూనియర్.. గతంలో సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, కొద్దిరోజులుగా ఇందులో బాగా యాక్టివ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే త‌న సినిమాలకు సంబంధించిన విష‌యాల‌నే కాక, ఇతర అంశాలను కూడా షేర్ చేస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్‌ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య‌ భారీగా పెరిగుతూ వస్తోంది.

273 ట్వీట్లతో వన్ మిలియన్

273 ట్వీట్లతో వన్ మిలియన్

తారక్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన చాలా రోజుల వరకు అందులో యాక్టివ్‌గా లేడు. అయితేనేం, అతడి పాలోవర్స్ మాత్రం క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నారు. గతంలో 1 మిలియన్ మార్కును చేరుకున్న సమయంలో అతడు చేసిన ట్వీట్లు కేవలం 273 మాత్రమే. ఇది ఒక రికార్డు. తక్కువ ట్వీట్లతో 1 మిలియన్ మార్కును చేరుకున్న సెలెబ్రిటీగా ఘనత సాధించాడు. ఇప్పుడు అతడి ఫాలోవర్స్ 3.2 మిలియన్లు ఉన్నారు.

ఫేస్‌బుక్‌లో ఎంట్రీ

ఫేస్‌బుక్‌లో ఎంట్రీ

జూనియర్ ఎన్టీఆర్ 2012లో ఫేస్‌బుక్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ట్విట్టర్ అకౌంట్ అంతకుముందే క్రియేట్ చేసుకున్నప్పటికీ తారక్ ఇందులోనే ఎక్కువగా యాక్టివ్‌గా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఫాలోవర్స్‌ను కూడా భారీగా పెంచుకున్నాడు. ప్రస్తుతం అతడి పేజీని 3.1 మిలియన్ మంది లైక్ చేశారు.

కొడుకుల ఫొటోతో ఇన్‌స్టాలోకి..

కొడుకుల ఫొటోతో ఇన్‌స్టాలోకి..

అభిమానుల మరింత అందుబాటులో ఉండడం కోసం తారక్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను కూడా తెరిచారు. తన ఇద్దరు కుమారులను ఫొటో తీస్తున్న ఒక పిక్‌ను తారక్ మొదటి పోస్టుగా పెట్టాడు. అలాగే, తన భార్యతో ఉన్న పిక్‌ను కూడా ఉంచాడు. ఆ తర్వాత తన చిత్రాలు, ఇతర విషయాలకు సంబంధించిన పిక్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నాడు.

ఇప్పుడు ఇన్‌స్టాలోనూ రికార్డే

ఇప్పుడు ఇన్‌స్టాలోనూ రికార్డే

ఇక, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చి చేరారు. దీంతో అతడి కుటుంబం పెద్దదైంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. తారక్ ఈ ఫీట్‌ను చేరుకోడానికి కేవలం 14 పోస్టులు మాత్రమే పెట్టాడు. గతంలో ట్విట్టర్ రికార్డు సృష్టించినట్లే.. ఇది కూడా రికార్డే కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X