ట్విట్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ రికార్డు: తక్కువ పోస్టులతోనే ఆ ఘనత సొంతం
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఎన్టీఆర్ మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనలోని టాలెంట్లను బయట పెట్టి స్టార్‌గా ఎదిగిపోయాడు. అదే సమయంలో ఎన్నో విజయాలను అందుకుని సత్తా చాటాడు. ఆ మధ్య సరైన హిట్ లేక సతమతం అయిన అతడు.. కొంత కాలంగా ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ నందమూరి హీరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండడు అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, అతడిని ఫాలో అయ్యే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ టైగర్ తన ట్విట్టర్‌లో 5 మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు. తద్వారా ఈ మైలురాయిని అందుకున్న అతి తక్కువ మంది హీరోల జాబితాలో చేరిపోయాడు. అయితే, అతి తక్కువ ట్వీట్లు చేసి ఐదు మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకున్న హీరోగా ఎన్టీఆర్ సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే.. తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు. దీని తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మరో ప్రాజెక్టును అనౌన్స్ కూడా చేసేశాడు. వీటితో పాటు 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షోతో బుల్లితెరపైకి హోస్టుగా రీఎంట్రీ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











