NTR30: కొరటాల మూవీ కోసం ఎన్టీఆర్ రిస్క్.. విక్రమ్ తర్వాత ఈ హీరోనే అలా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే ఎన్నో భారీ విజయాలను అందుకున్నాడు. దీంతో అతడి స్టార్‌డమ్‌తో పాటు మార్కెట్‌ కూడా భారీగా పెంచుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా 'టెంపర్' నుంచి హిట్ ట్రాక్ ఎక్కిన తారక్.. వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ హిట్లను అందుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు.

ఈ మధ్య ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న నందమూరి హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాను చేశాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, అత్యధిక కలెక్షన్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను చెరిపేసింది. అలాగే, ఎన్టీఆర్ రేంజ్‌ కూడా దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ ఉత్సాహంతోనే ఈ స్టార్ హీరో తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది.

Jr NTR Reducing Weight for Koratala Shiva Movie

'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో రాబోతున్న ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా జూలై నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని కూడా డైరెక్టర్ కొరటాల శివ కొద్ది రోజుల క్రితమే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ, దీన్ని అనుకున్న సమయానికి మొదలు పెట్టే అవకాశాలు లేవని.. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు విభిన్నమైన గెటప్‌లతో కనిపించబోతున్నాడట. అందులో ఒకటి స్లిమ్ లుక్ కాగా.. రెండోది కాస్త బొద్దుగా ఉండే పాత్ర అని తెలిసింది. ఒక పాత్ర కోసం ఎన్టీఆర్ ఏకంగా 10 కేజీల బరువు తగ్గాల్సి ఉంటుందట. ఇలా ఒకే సినిమా కోసం రెండు రకాల బరువులతో అతడు కనిపించబోతున్నాడని తెలుస్తోంది. గతంలో ఇలా చియాన్ విక్రమ్ 'ఐ' సినిమా కోసం వేరు వేరు బరువులతో కనిపించాడు. ఇప్పుడు తారక్ కూడా అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడని తెలుస్తోంది. దీనిబట్టి అతడు ఈ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని గ్లిమ్స్ వీడియో ద్వారా స్పష్టం చేశారు. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు.. అన్ని సిస్టమ్‌లను ఎదురించే శక్తిలా ఎలా ఎదిగాడు అన్న కథతో ఇది రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X