లవ్ బ్రేకప్‌తో జూ.ఎనీఆర్ట్ రియలైజ్.. అందుకే ప్రణతిను పెళ్లి చేసుకున్నాడా?
NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. సన్సెషల్ డైరెక్టర్
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 27న విడుదలవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ లాగానే ట్రైలర్ కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన గంటలో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తోంది. దీంతో తారక్ దేవర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇదెలా ఉంటే.. ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ మూవీ వస్తుండటంతో అంచనాలు బాగా పెరిగాయి. అభిమానుల కంటే ఎన్టీఆర్ ఎక్కువ హోప్స్ తో ఉన్నట్టు తెలుస్తోంది. ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ఈ సినిమా వస్తుందంటే తనకు చాలా నర్వస్‌గా ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే.. దేవర సినిమాలో మెయిన్ బ్లాక్‌ని రివీల్ చేశారు. క్లైమాక్స్ లోని చివరి 40 నిమిషాలు మామూలుగా ఉండనీ, ఆ సీన్స్ చూస్తే.. గూస్ బంమ్స్ అని చెప్పుకొచ్చారు. దీంతో మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇదిలా ఉంటే.. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూ క్లిప్‌లో తారక్ తన లవ్, బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యారు. అలాగే తనకు ఎలాంటి భార్య రావాలనుకుంటున్నాడో ముందుగానే ఫిక్సయ్యానని తెలిపారు. ఆ ఇంటర్య్వూలో.. ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా? అని యాంకర్ ప్రశ్నించగా.. జూనియర్ ఎన్టీఆర్ నవ్వుతూ..'ఎందుకు లేండీ? ఎన్నో ఉంటాయి. ఇప్పుడు వద్దులే' అంటూ సమాధానం దాటవేసి ప్రయత్నం చేశారు. సరే.. మరీ ఫస్ట్ ఎవరి విషయంలో బాగా.. ఆట్రాక్ట్ అయ్యారు అని యాంకర్ ప్రశ్నించగా.. వెంటనే తారక్ నవ్వుతూ..' అప్పట్లో బాగా.. పబ్లిక్ సీటి చేశారుగా' అని సమాధానమిచ్చారు.

'ఎవరైనా ఏదొక విషయంలో.. ఏదొక సమయంలో ఒకరిపై ఇష్టం కలుగుతోంది. కొంత సమయానికి రియలైజ్ అయ్యా. ఆ తరువాత.. ఇది సరికాదని ఫిక్స్ అయ్యాను. అప్పుడు నా వయసు 23 అని చెప్పారు. మరీ ఆ విషయం గురించి మళ్లీ ఆలోచించారా అని ప్రశ్నించగా.. ''లేదు.. లేదు.. ఓ సారి నిర్ణయం తీసుకున్నా తరువాత మళ్లీ ఆలోచించను. ఆ రోజే ఫిక్స్ అయ్యాను.. ప్రొఫెషనల్ లైఫ్ ను.. పర్సనల్ లైఫ్ ను అసలూ కలపకూడదని.. ప్రొఫెషనల్ వేరు.. పర్సనల్ లైఫ్ వేరు అని గ్రహించాను. ఈ సమయంలోనే నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఎవరైతే.. మా అమ్మను బాగా చూసుకుంటారో వాళ్లను మాత్రమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం.. నేను చూసుకునేంత చూసుకోకపోయినా.. నాలో కొంత చూసుకున్నా నేను హ్యాపీ . ఈ క్రమంలోనే లక్ష్మీప్రణతిని పెళ్లి చేసుకున్నా' అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











