Devara: దేవర ఫస్టాఫ్ 5 గంటలా నిడివా?.టాప్ సీక్రెట్ చెప్పిన ఎన్టీఆర్

ఇప్పుడు చాలా కాలం తర్వాత అవైటెడ్ గా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం ఏదైనా ఉంది అంటే అది "దేవర" అని చెప్పవచ్చు. కాగా ఈ భారీ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ఈ "దేవర". కాగా ఈ సినిమా దాదాపు 5 ఏళ్ళు తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా సినిమా అని తెలిసిందే.

పైగా రాజమౌళి సెంటిమెంట్ అనిరుద్ సెంటిమెంట్ ఇలా చాలానే సెంటిమెంట్స్ వంటి వాటి నడుమ ఈ సినిమా ఫలితం చూసుకునేందుకు వస్తుంది. అయితే ఈ చిత్రం కూడా ఇండియన్ సినిమా దగ్గర ఊపందుకున్న సీక్వెల్స్ పర్వం లోనే రెండు భాగాలుగా అయితే రిలీజ్ కి రాబోతుంది. ఇలా ఈ ఫ్రైడే దేవర మొదటి భాగం వస్తుంది. సరే ఇదంతా బాగానే ఉంది కానీ అసలు దేవర అనే సినిమా ఎందుకు రెండు భాగాలుగా మారింది అనే అంశం రివీల్ అయ్యింది.

Jr NTR reveals Devara Part 1 is 5 hours runtime thats why devara became 2 parts

ఈ చిత్రాన్ని మొదట్లోనే కావాలని రెండు భాగాలుగా ప్లాన్ చేయలేదట. మనం చూసుకుంటే దేవర స్టార్టింగ్ అనౌన్స్ అయ్యిన కొన్ని నెలలు వరకు ఎక్కడా కూడా దేవర పార్ట్ 1 అని కనిపించదు. సినిమా చేస్తున్న మధ్యలోనే దీనికి రెండు భాగాలు ఉంటే బాగుంటుంది అని స్వయంగా ఎన్టీఆర్ నే కొరటాల శివకి సూచించాడట. ఈ చిత్రంలో చాలా అంటే చాలా పాత్రలకి ప్రాముఖ్యత ఉండడం తారక్ గమనించాడట.

అంటే విలన్ సైఫ్ కి గాని తన డ్యూయల్ రోల్స్ కి గాని హీరోయిన్ పాత్రకి ఇంకా కొంతమంది పాత్రలకి ఇంపార్టెన్స్ ఉండడం గమనించాడట. అందుకే వాటిని బాగా డెవలప్ చేయాలని కొరటాలకి సూచిస్తే అలా ప్లాన్ చేసి తెరకెక్కించినప్పుడు సినిమా ఫస్టాఫ్ పూర్తయ్యే సరికీ ఏకంగా 5 గంటల ఫుటేజ్ వచ్చేసిందట. దీనితో అక్కడ ఈ సినిమాని రెండు భాగాలుగా ఎందుకు చేయకూడదు అనే ఐడియా వచ్చిందట.

Jr NTR reveals Devara Part 1 is 5 hours runtime thats why devara became 2 parts

ఇలా దేవర రెండు ముక్కలై రెండు భాగాలుగా మారింది. అందులో మొదటిదే ఇప్పుడు సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో విడుదలకి రాబోతుంది. కాగా ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నిటినీ తారక్ బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దర్శకుడు అయినటువంటి కరణ్ జోహార్ అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ లతో కలిసి ప్లాన్ చేసిన స్పెషల్ హిందీ ఇంటర్వ్యూలో వెల్లడి చేసాడు.

మరి పార్ట్ 1 ఫలితం ఎలా ఉంటుందో తెలియాలి అంటే అప్పుడు వరకు ఆగాల్సిందే. ఇంకా ఈ సినిమాకి అనిరుద్ క్రేజీ మ్యూజిక్ వర్క్ ని అందించగా తన మ్యూజిక్ ఈ సినిమాకి ఓ రేంజ్ లో ఇచ్చి లేపాడు అని ఎన్టీఆరే తెలిపాడు. మరి చూడాలి దేవర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడు అనేది.

More from Filmibeat

Read more about: jr ntr devara 2 koratala siva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X