Jr NTR ఆస్తుల విలువ ఎంత? RRR మూవీకి రెమ్యునరేషన్ ఎంతంటే?
నందమూరి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని టాలీవుడ్‌లోకి ప్రవేశించిన జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా నుంచే హిట్లను తన ఖాతాలో వేసుకొన్నారు. ప్రతీ చిత్రంలో విభిన్నమైన పాత్రలను పోషించడమే కాకుండా విలక్షణమైన నటనను ప్రదర్శిస్తుంటూ యంగ్ టైగర్‌గా మారారు. అయితే RRR చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. అయితే RRR చిత్రానికి అందుకొన్న రెమ్యునరేషన్ ఎంత? ఎన్టీఆర్ ఆస్తులు ఎంత? అనేది విషయం తాజాగా మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వంతో
నందమూరి తారక రామారావు ఉరఫ్ జూనియర్ ఎన్టీఆర్‌గా సినీ ప్రేక్షకులకు సుపరిచితులైన యంగ్ టైగర్ తొలి నుంచే తరగని ఆస్తులు ఉన్న కుటుంబంలో పుట్టారు. తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ పెంపకంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం గడిచిపోయింది. సినీ రంగంలోకి వచ్చాక సక్సెస్‌లు వరుసగా పలకరించడంతో డబ్బుకు కొదువే లేకుండా పోయింది.

విజయాల పరంపరతో
ఇక జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్యలో వైఫల్యాలు వచ్చినా ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. కానీ మళ్లీ సక్సెస్ మంత్రను పట్టుకొని వరుస విజయాలను తన ఖాతాలు వేసుకొన్నాడు. దాంతో ఈ రెమ్యునరేషన్ సినిమాకు సినిమాకు పెరుగుతూ పోయింది. దాంతో టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకొనే హీరోల్లో ఒకరిగా జూనియర్ ఎన్టీఆర్ చేరిపోయారు.

పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా
ఇక సినిమా ఆఫర్లే కాకుండా వ్యాపార ప్రకటనలు, వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ బిజీగా మారిపోయారు. చేతి నిండా బ్రాండ్స్‌తో క్రేజీ సెలబ్రిటీ మారిపోయారు. ప్రముఖ కంపెనీలకు చెందిన పలు ప్రోడక్టులకు చిరునామాగా మారిపోయారు. ఎన్టీఆర్ బ్రాండింగ్ కోసం పలు కంపెనీలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే.

RRR సినిమాకు రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇక RRR చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌ను, జీవనశైలిని, ప్రతిష్టను మార్చేసింది. RRR చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. దేశవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకొన్నారు. బాలీవుడ్‌లో కూడా భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ తెలుగు సినిమాకే ఆయన పరిమితమయ్యారు. RRR సినిమాకు సుమారు 45 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకొన్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

జూ. ఎన్టీఆర్ ఆస్తుల మొత్తం విలువ
అలాగే ఎన్టీఆర్‌కు వంశపారంపర్యంగానే కాకుండా తాను స్వయంగా సంపాదించుకొన్న ఆస్తులు భారీగానే ఉన్నాయనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తన భార్య తరఫు నుంచి వచ్చిన ఆస్తులు భారీగానే ఉన్నాయనేది ఇండస్ట్రీ టాక్. అయితే ఎన్టీఆర్ మొత్తం ఆస్తుల విషయానికి వస్తే.. సుమారు 600 కోట్లకుపైగానే ఉంటాయని సన్నిహితులు చెప్పుకొంటారు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమా కెరీర్..
ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే.. RRR సినిమా కోసం మూడు సంవత్సరాలకుపైగానే వెచ్చించారు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్30 సినిమాతో సిద్దమవుతున్నారు. ఆ తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఓ క్రేజీ ప్రాజెక్టుకు సిద్దమవుతున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











