Jr NTR: భార్యతో బ్యూటీఫుల్ మూమెంట్ షేర్ చేసుకున్న తారక్.. ఫొటో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత చాలా వరకు తన కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేందుకు ఇష్టపడ్డాడు. తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఒకవైపు చర్చలు జరుపుతూనే మరొకవైపు ఫ్యామిలీతో కలిసి ఎక్కువ భాగం కాలక్షేపం చేశాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే RRR సినిమాతో ఉన్నన్ని రోజులు కూడా రాజమౌళి కారణంగా చాలా అలసిపోయాడు అనే చెప్పాలి. అప్పట్లో ఇంటర్వ్యూలలో కూడా రాజమౌళి ఎంతగా కష్టపెట్టాడో కూడా ఎన్టీఆర్ సరదాగా వివరణ అయితే ఇచ్చాడు.
అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో హాలిడే టూర్స్ కు వెళ్లిన కొన్ని పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక చాలా కాలం అనంతరం ఎన్టీఆర్ తన బార్యతో ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇలాంటి మూమెంట్స్ అంటే ఇష్టమని అంటూ తన భార్య లక్ష్మీ ప్రణతితో ఏకాంతంగా చర్చలు జరుపుతున్నట్లు తారక్ ఆ ఫొటోలో హైలెట్ అయ్యాడు. చుట్టూ ప్రకృతి హ్యాపీగా కాఫీ తాగుతూ ఇద్దరు అలా కనిపించడం నెటిజన్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇక ఆ ఫొటో సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేయగానే నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది.

ఇక చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ బాంబిసార సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించిన విషయం తెలిసిందే. కాస్త బొద్దుగా కనిపించిన తారక్ మళ్లీ కొరటాల శివ సినిమా కోసం సరికొత్త ఫిట్నెస్ తో కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ మొదటి షెడ్యూల్ కోసం ప్రణాళికలు రచిస్తున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలని ఆలోచనతో ఉన్నాడు. ఆ ప్రాజెక్టుపై ఇదివరకే ఆఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చారు. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇంకా ఆ కాంబినేషన్ పై అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒకవేళ ఫిక్స్ అయితే మైత్రి మూవీ మేకర్స్ లోనే ఆ ప్రాజెక్టు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications











