RRR : ఎమోషనల్ అయిన ఎన్టీఆర్.. పేరుపేరునా పలకరిస్తూ ధన్యవాదాలు.. ప్రామిస్ చేస్తున్నాను అంటూ!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రాజమౌళి టేకింగ్ కు, రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు ప్రసంశలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ విషయం మీద రామ్ చరణ్ స్పెషల్ నోట్ విడుదల చేయగా ఇప్పుడు ఎన్టీఆర్ సుదీర్ఘ నోట్ పంచుకున్నారు. ఆ నోట్ ను ఆయన మాటల్లోనే మీకు అందించే ప్రయత్నం చేశాం.
Recommended Video


వెర్సటైల్ అనిపించేలా
''ధన్యవాదాలు, మీరందరూ RRR పై ప్రశంసలు కురిపించారు. సినిమా విడుదలైనప్పటి నుంచి మమ్మల్ని ప్రేమతో ముంచెత్తారు. నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలిచిన RRRను సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేయాలనుకుంటున్నాను. ముందుగా నా బెస్ట్ ఇవ్వడానికి నన్ను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు జక్కన్న. మీరు నిజంగా నాలోని ఉత్తమమైన వాటిని బయటకు తీసుకొచ్చారు, నన్ను నీరుగా చూపి వెర్సటైల్ అనిపించేలా చేశారు. మీరు నాలోన నటుడిని పురికొల్పారు, మీరు అనుకున్న క్యారెక్టర్ లోకి నన్ను మౌల్డ్ చేయడమే కాక ఆ క్యారెక్టర్ లో ఉన్న దాదాపు అన్ని విషయాలను చాలా ఈజ్ తో ప్రేక్షకులు అర్థం చేసుకునే విధంగా నటించడంలో సహాయపడ్డారు.

గౌరవంగా భావిస్తున్నా
రామ్ చరణ్ సోదరా, నువ్వు లేకుండా ఈ సినిమాలో నటించడానికి నేను ఊహించుకోలేక పోతున్నాను.. నువ్వు కాకుండా డా మరెవరూ కూడా అల్లూరి సీతారామరాజు పాత్రను న్యాయం చేయగలరు అని నేను అనుకోవడం లేదు. కేవలం ఈ పాత్ర మాత్రమే కాదు నేను పోషించిన భీమ్ పాత్ర కూడా నువ్వు లేకుండా సంపూర్ణం కాదు. నా నీటికి అగ్నిగా ఉన్నందుకు ధన్యవాదాలు. అజయ్ సార్, మీతో పని చేయటం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను, ఈ మెమరీని జీవితాంతం గుర్తుంచుకుంటాను.

మరింత విలువ పెంచారు
అలియా భట్, మీరు నటన విషయంలో ఒక పవర్ హౌస్, మీరు సినిమాకు మీ ప్రెజెన్స్ తో మరింత విలువ పెంచారు. ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఒలీవియా మోరిస్, అలిసన్ డ్యూడీ, రే స్టీవెన్సన్ అనేక హృదయాలను వారి ప్రేమను గెలుచుకున్నారు. మీ పర్ఫామెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండియన్ సినిమాకు స్వాగతం మీతో ఉన్న గుర్తులను ఎప్పటికీ మర్చిపోలేను. డివివి దానయ్య గారు మీరు ఒక రాక్, RRR అనే ఒక కలను నిజం చేయడానికి నిరంతరం కృషి చేసిన మీకు ధన్యవాదాలు.
అందరి చెవులను తాకుతూ
కీరవాణి గారి విషయానికి వస్తే ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు RRR సినిమాకు ప్రాణం పోసినందుకు ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మీరు సినిమా కోసం ఇచ్చిన హృద్యమైనన, గుండెను పిండేసే సంగీతం అనేక సంవత్సరాలపాటు ప్రేక్షకుల మనసులో నిలిచి పోతుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు అందించిన సంగీతం కల్చర్, భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి చెవులను తాకుతూ అందరి మనసులో గూడు కట్టుకుంటుంది..

వెండితెర మీద అద్భుతాలు
భారతదేశ సినీ పరిశ్రమకు ఇలాంటి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ అందించినందుకు విజయేంద్ర ప్రసాద్ గారికి నేను రుణపడి ఉంటాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక వందల మంది సినీ ప్రేమికుల మనసులో ఈ సినిమా గూడుకట్టుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొన్ని జనరేషన్ల పాటు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు అని కూడా చెప్పగలను. అలాగే సెంథిల్ గారికి, శ్రీకర్ ప్రసాద్ గారికి శ్రీనివాస్ మోహన్ గారికి అలాగే ప్రతి డిపార్ట్మెంట్ లో పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు పనిచేసిన దాని వల్లే ఈ సినిమా వెండితెర మీద అద్భుతాలు సృష్టిస్తోంది. మీరు లేకుండా ఇంతటి అద్భుతమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది అసాధ్యం.

ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి స్పెషల్ థాంక్స్
కార్తికేయ నువ్వు ఈ సినిమా మొత్తానికి యాంకర్, ప్రతి విషయాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ సినిమా మొత్తం సాఫీగా సాగడానికి కారణం అయినందుకు ధన్యవాదాలు అలాగే కొమరం భీముడు అనే సాంగ్ పాడిన కాలభైరవకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే నువ్వు అనేక లక్షల మంది ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేలా చేశావు. నాటు నాటు అనే సాంగ్ కి ఒక కొత్త మాస్ స్టెప్ అందించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి స్పెషల్ థాంక్స్.

మరోసారి రుజువు చేశారు
అలాగే నేను భారత సినీ పరిశ్రమను, ప్రతి భాషకు సంబంధించిన పరిశ్రమలకు చెంది ఈ సినిమాకు సపోర్ట్ అందించి బెస్ట్ విషెస్ అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నాను. ఒక అద్భుతమైన సినిమాను ఇండియన్ సినిమాగా తీసుకురావడానికి మీరు చూపించిన మద్దతు మరువలేనిది. మనమందరం కలిస్తే ఇండియన్ సినిమా నెంబర్ వన్ అవుతుందని మరోసారి రుజువు చేశారు.

మద్దతు అద్భుతమైనది
అలాగే నేను భారతీయ మీడియాని కూడా కేవలం థాంక్స్ చెప్పి సర్ది చెప్పలేను సినిమా గురించి వాళ్ళ అప్రిసియేషన్ సినిమాకు వాళ్ళు ఇచ్చిన మద్దతు అద్భుతమైనది. RRR సినిమాని ఇండియా కి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఫిలిం కాకుండా ప్రపంచానికి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఫిలింగా మార్చిన ఇండియన్ మీడియా కి ధన్యవాదాలు. చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను నా ఫ్యాన్స్ కి హృదయపు అంచుల నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మీ అన్ కండిషనల్ సపోర్ట్ లాంటివి కరోనా లాంటి ఎంతో కఠినమైన సమయాల్లో కూడా నేను ముందుకు నడవడానికి కారణమయ్యాయి. ఇక ముందు కూడా అనేక సినిమాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను అంటూ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











