వాడు నాకు ఎలాంటి గౌరవం ఇవ్వడు.. టార్చర్ చూపిస్తాడు.. ఆ హీరోపై ఎన్టీఆర్ కామెంట్స్
మన హీరోలలో బయటకు తెలియని బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. కొందరైతే చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ప్రాణ దోస్తులైతే మరికొందరు సినిమాల ద్వారా ఒకటైన మిత్రులు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా చాలా మంది హీరోలకు చాలా క్లోజ్ ఫ్రెండ్. స్టార్ హీరోగా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మనోడే అనేలా ఉంటాడు తారక్. ఇక ఒక హీరో గురించి మాత్రం తారక్ ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేశాడు. అతను తనకు టార్చర్ చూపిస్తాడాని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

వాళ్ళ స్నేహం ఎలా మొదలైందంటే..
ఇక ఆ టార్చర్ పెట్టె హీరో మరెవరో కాదు. మంచు మనోజ్. జూనియర్ ఎన్టీఆర్, మనోజ్ హీరోలు అవ్వకముందే చాలా మంచి స్నేహితులు. వాళ్ళ స్నేహం ఎలా మొదలైంది అంటే.. మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ లో అనుకోకుండా కలుసుకున్న ఇద్దరు అప్పుడే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు కూడా 1983 మే 20న పుట్టారు. ఇద్దరు భూమ్మీదకు రావడానికి ఆరు గంటల మాత్రమే తేడానట.

ఎన్టీఆర్ బ్రహ్మకథ
ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మనోజ్ గురించి ఒక బ్రహ్మకథ ముదా చెప్పాడు. ఎన్టిఆర్ మాట్లాడుతూ.. బ్రహ్మదేవుడు ఒకసారి దీర్ఘంగా ఆలోచించి రెండు బొమ్మలను తయారు చేశాడు. రూపాలు వేరైనా కూడా ఒకేలా ఆలోచించే బొమ్మలు అవి. అయితే బ్రహ్మ ఆ రెండింటికి ఒక పరీక్ష పెట్టాడు. అల్లరి చేయకుండా వినయంగా ఉన్న బొమ్మను కిందకు పంపాలని అనుకున్నాడు. అదే నేను అయ్యాను.

నాకు టార్చర్ మొదలైంది
మరో ఆరు గంటల తరువాత ఇంకో బొమ్మ నన్ను ఎలా కిందకు పంపవు అంటూ బ్రహ్మదేవుడిని గిల్లేసింది. దీంతో అది భటించలేక ఆయన కిందకు వదిలేశాడు. సరిగ్గా మోహన్ బాబు ఇంట్లొనే పుట్టేలా చేశారు. వాడే మనోజ్. ఇక అప్పటి నుంచి నాకు టార్చర్ మొదలైంది. మనోజ్ చేసిన పనులకు ఇంట్లో నేను బుక్కయ్యేవాన్ని. ఎన్నో సార్లు ఇబ్బంది పడ్డాను.
Recommended Video

వాడు నాకు ఎలాంటి గౌరవం ఇవ్వడు
వాడు వస్తున్నాడు అంటే ప్రకృతి ముందే చెప్పేస్తుంది. ఇద్దరం ఒకే రోజు పుట్టినా కూడా మనోజ్ నా కంటే ఆరు గంటల చిన్నవాడు. కానీ నాకు వాడు మాత్రం ఎలాంటి గౌరవం ఇవ్వడు. ఎరా.. ఏంట్రా అని పిలుస్తూ ఉంటాడని.. జూనియర్ ఎన్టీఆర్ వారి స్నేహం గురించి వివరణ ఇచ్చాడు. ఇక అప్పుడప్పుడు పార్టీలలో కూడా ఈ హీరోలు కలిసి చాలా సేపు మాట్లాడుకుంటూ ఉంటారట. ఎవరు ఎలాంటి స్టేజ్ లో ఉన్నా కూడా స్నేహంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని నిరూపించారు.


Click it and Unblock the Notifications











