twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: నువ్వు విషం ఇచ్చినా తాగుతాను.. రామ్ చరణ్ తో ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్!

    |

    ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక బిగ్ బడ్జెట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మెగా నందమూరి హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు అయితే మామూలుగా లేవు. పైగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించడంతో మిగతా భాషల్లో కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇక రెగ్యులర్ గా సినిమా హీరోల విభిన్నమైన తరహాలో ఇంటర్వ్యూలు ఇస్తూ మరింత ఫోకస్ పెంచుతున్నారు. ఇక రీసెంట్ గా సినిమాకు సంబంధించిన ఒక చిట్ చాట్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఆర్ రామ్ చరణ్ తో మాట్లాడిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

    ఆఫ్ ది రికార్డ్

    ఆఫ్ ది రికార్డ్

    ఒక సినిమా మార్కెట్ లోకి రావాలి అంటే రాజమౌళి వేసే ప్లాన్ చాలా విభిన్నంగా ఉంటుంది అనే చెప్పాలి. ఆయన సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడే ప్రమోషన్స్ విషయంలో కూడా పక్కాగా ఒక క్లారిటీ తో ఉంటారు. బాహుబలి సినిమా విషయంలో రాజమౌళి వేసిన ప్రతి ఒక్క ప్లాన్ కూడా ప్రమోషన్ లో చాలా ఉపయోగపడింది. ఇంటర్వ్యూలు కూడా డిఫరెంట్ గా ఉండాలి అని రాజమౌళి ఆలోచిస్తూ ఉంటాడు. రీసెంట్ గా ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుకున్నట్లు రాజమౌళి హీరోలు ఇద్దరితో చేసిన ఇంటర్వ్యూ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    కాఫీ పెడతానన్న చరణ్

    కాఫీ పెడతానన్న చరణ్

    ప్రతి ఇంటర్వ్యూలో కూడా సినిమాకు సంబంధించిన అనేక విషయాలను చెప్పిన రాజమౌళి ఆఫ్ ద రికార్డ్ ఇంటర్వ్యూలో మాత్రం హీరోల స్నేహాన్ని హైలెట్ అయ్యే విధంగా చూపించారు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉంటారు అని మరోసారి క్లారిటీ గా అర్థమైంది. చరణ్ అయితే నేను కాఫీ పెడతాను అంటూ ముందుకు వచ్చాడు.

    చాలాసార్లు కోపం వచ్చింది

    చాలాసార్లు కోపం వచ్చింది

    ప్రమోషన్స్ చేసి చేసి అలసిపోయినట్లుగా హీరోలిద్దరూ కనిపిస్తూ ఉండడం విశేషం. ఇక రాజమౌళి కూడా హీరోలు ఇద్దరిని ప్రమోషన్స్ లో కూడా టార్చర్ పెట్టడంలో వదిలి పెట్టడం లేదు అని అర్థమైంది. షూటింగ్ టైమ్ లో చాలా సార్లు రాజమౌళి పై కోపం వచ్చింది అని జూనియర్ ఎన్టీఆర్ చాలా ఓపెన్ గానే వివరణ ఇచ్చాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఎంత అలిసిపోయిన కూడా కనీసం సానుభూతి చూపించడం లేదు అని చెప్పుకొచ్చాడు

    Recommended Video

    RRR: India's Biggest Pre Release Event At Chikkaballapura | NTR | SS Rajamouli | Filmibeat Telugu
    విషం ఇచ్చినా తాగుతాను

    విషం ఇచ్చినా తాగుతాను

    ఇక ఒకరికొకరు ప్రమోషన్స్ ఎలా చేస్తారు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారు అని మాట్లాడుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అలిసిపోయి సోఫా దగ్గర అలా కూర్చోవడంతో జూనియర్ ఎన్టీఆర్ మీ ఇద్దరికీ తాగడానికి నేను ఏదైనా తీసుకు వస్తాను అంటూ కిచెన్ దగ్గరికి వెళ్లి పోయాడు. నువ్వు ఏం తాగుతావు అంటూ చరణ్ అడగడంతో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నీ చేతితో విషయం ఇచ్చిన తాగుతాను అంటూ ఊహించని విధంగా చెప్పడం విశేషం. ఇక ఆ మాటకు చరణ్ రాజమౌళి ఇద్దరు కూడా సరదాగా నవ్వుకున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ స్నేహం కూడా రెగ్యులర్ ఫ్రెండ్స్ తరహాలోనే ఉంది అని అభిమానులు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు.

    English summary
    Jr ntr shocking comments on ram charan of the record interview,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X