Jr NTR Birthdayపై షాకింగ్ నిర్ణయం.. ఈసారి కూడా నిరాశ తప్పట్లేదు...!
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా రోజులవుతోంది. చివరగా అరవింద సమేత తరువాత రాజమౌళి RRR కోసం వెళ్లిన తారక్ బిగ్ స్క్రీన్ పై మళ్ళీ కనిపించలేదు. కరోనా ధాటికి RRR వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరో ఏడాది పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఈసారి కూడా ఎన్టీఆర్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ తప్పేలా లేదు.
బికినీలో నిక్కి తంబోలి.. దక్షిణాఫ్రికా బీచుల్లో రచ్చ రచ్చ

అభిమానులకు నచ్చేలా
జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానులకు నచ్చేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కాస్త కమర్షియల్ గా ట్రై చేస్తూనే తనలోని సరికొత్త షేడ్స్ ను బయటపెడుతుంటాడు. దర్శకులు కూడా తారక్ తో చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ప్రస్తుతం అభిమానులు RRR కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సినిమా పూర్తయ్యే వరకు
గతంలో ఎప్పుడు లేని విదంగా జూనియర్ ఎన్టీఆర్ బిగ్ స్క్రీన్ కు చాలా ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. 2018 అక్టోబర్ లో వచ్చిన అరవింద సమేత సినిమా అనంతరం మళ్ళీ మరో సినిమా రాలేదు. రాజమౌళి కోసం డేట్స్ కాకుండా సినిమా పూర్తయ్యే వరకు నీతోనే అంటూ కమిట్మెంట్ ఇచ్చేశాడు.

RRR మొదలైనప్పటి నుంచి
ఇక RRR మొదలైనప్పటి నుంచి కూడా ఏదో ఒక విధంగా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా షూటింగ్స్ లలో కొన్నిసార్లు గాయపడ్డారు కూడా. ఇక కరోనా వలన మరో దెబ్బ పడింది. చిత్ర యూనిట్ మొత్తం కరోనా బారిన పడి మళ్ళీ కోలుకున్న విషయం తెలిసిందే.

హెల్త్ అప్డేట్..
ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అలాగే కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కోవిడ్ 19 పాజిటివ్ వచ్చినట్లు వివరణ ఇవ్వడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. కానీ ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నట్లు మెగాస్టార్ కూడా ఒక హెల్త్ అప్డేట్ ఇచ్చేశారు.
Recommended Video

పుట్టినరోజు షాకింగ్ నిర్ణయం
ఇక అభిమానుల క్షేమం గురించి ఎక్కువగా ఆలోచించే తారక్ ఈసారి పుట్టినరోజు వేడుకలు చేయవద్దని క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతిసారి తారక్ బర్త్ డే (మే 20) వచ్చింది అంటే తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు బారి కటౌట్స్ తో పండగల సెలబ్రెట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం కరోనా తాకిడి ఎక్కువగా ఉండడంతో వాటికి దూరంగా ఉండాలని సూచించనున్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా RRR కు సంబంధించిన పోస్టర్ విడుదల కానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











