ఆరు గెటప్పులో ఎన్టీఆర్.. బట్టతల లుక్ కూడా.. బయపెడుతున్న జక్కన్న

జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఒక సినిమాకు ఏమి కావాలో అన్ని రకాలుగా తన శక్తిని ధారపోయగలడు. నటనపరంగానే కాకుండా ఒక వైపు డ్యాన్స్ తో మరోవైపు డైలాగ్స్ తో.. ఇలా పెర్ఫెమెన్స్ తో సినిమా స్థాయిని పెంచగలడు. అందుకే స్టార్ దర్శకులు ఎన్టీఆర్ తో ఒక్కసారైనా సినిమా చేయాలని అనుకుంటారు. ఇక దర్శకుడు రాజమౌళి చరిత్ర తిరగరాసేలా తారక్ తో RRR సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ టీజర్ ఎప్పుడొస్తుందో..

ఆ టీజర్ ఎప్పుడొస్తుందో..

ఇక కరోనా వైరస్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వాయిదా పడటం అందరిని షాక్ కి గురి చేసింది. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతని పాత్రకు సంబంధించిన అల్లూరి సీతారామరాజు లుక్ ని రివీల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి నందమూరి అభిమానులు కూడా తారక్ కొమురం భీమ్ టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 కరోనా భారిన పడటంతో..

కరోనా భారిన పడటంతో..

కరోనా వైరస్ డోస్ తగ్గిన తరువాత వీలైనంత త్వరగా రాజమౌళి ముందుగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నప్పటికి వర్కౌట్ కావడం లేదు. మొన్నటివరకు షూటింగ్ చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఇక ఇటీవల రాజమౌళితో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనా భారిన పడటంతో ఇక ఇప్పట్లో షూటింగ్ జరిగే అవకాశం లేదని అర్ధమయ్యింది.

జూనియర్ ఆరు గెటప్పులో

జూనియర్ ఆరు గెటప్పులో

అసలు మ్యాటర్ లోకి వస్తే.. RRR సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులగా కనిపించనున్న ఈ ఇద్దరు హీరోలు సినిమాలో విభిన్నమైన గెటప్పులో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిల్వనున్నారట. ముఖ్యంగా జూనియర్ ఆరు గెటప్పులో కనిపిస్తాడని తెలుస్తోంది.

Recommended Video

Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
బట్టతల లుక్ లో ఎన్టీఆర్

బట్టతల లుక్ లో ఎన్టీఆర్

అయితే జూనియర్ కనిపించబోయే ఆరు గెటప్పులో ఒక లుక్ లో బట్టతలతో కూడా కనిపిస్తాడని రూమర్స్ వస్తున్నాయి. సినిమాకు అవసరం అయితే గాని పెద్దగా ప్రయోగాలు చేయని రాజమౌళి RRRలో కూడా తారక్ తప్పక చేయవలసిన పాత్రల విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అనుకున్నది అనుకున్నట్టుగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ పాత్ర జనాలని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X