Jr NTR: అన్ని చూస్తున్నాను.. కానీ ఇది సమయం కాదు.. అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం అభిమానులు గత కొన్ని రోజులుగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వెండితెరకు చాలా గ్యాప్ ఇవ్వడంతో సినిమాలకు సంబంధించిన ఏదైనా పోస్టర్స్ విడుదల చేస్తే సెలబ్రేట్ చేయాలని కొంతమంది వేయిట్ చేస్తున్నారు. అయితే అలాంటి వారందరికీ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఒక విన్నపాన్ని తెలియజేశారు.
Recommended Video

ఆరోగ్యం ఎలా ఉందంటే..
జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులజూ కూడా పాజిటివ్ వచ్చిందని వెంటనే తాము ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు చెప్పిన తారక్ ప్రస్తుతం ఆరోగ్యం కూడా నిలకడగానే ఉన్నట్లు వివరణ ఇచ్చారు. త్వరలోనే కొలుకొని మీ ముందుకు వస్తానని ఇటీవల మరొక లేఖ ద్వారా కూడా తెలియజేశారు.

అన్ని చూస్తున్నాను..
అభిమానులు పంపుతున్న వీడియోలు సందేశాలు అన్ని చూస్తున్నాను. మీ ప్రేమకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. ప్రతి సారి మీరు నా పుట్టినరోజు చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ ఏడాది మీరు ఇంటి వద్దే ఉంటూ లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. అదే మీరు నకిచ్చే అతిపెద్ద కానుక.. అని తెలియజేశాడు.

అండగా నిలవాలి
ఇది సెలబ్రేషన్స్ చేసుకునే సమయం కాదు. దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. డాక్టర్లు నర్సులు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మన మద్దతు తెలపాలి. చాలామంది జీవనోపాధి కోల్పోయారు. అలాంటి కుటుంబాలకు అండగా నిలవాలి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకోండి. చేతనైన ఉపకారం చేయండి.. తారక్ పేర్కొన్నాడు.

ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం
అంతే కాకుండా మనం దేశం ఈ కరోనాను జయిస్తుందని నమ్ముతున్నాను అంటూ ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందామని, అప్పటి వరకు మాస్క్ దరించండి, జాగ్రత్తగా ఉండండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు. ఇక పుట్టిన రోజున ఎన్టీఆర్ రాబోయే సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ తో పాటు స్పెషల్ అప్డేట్స్ కూడా రాబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











