ఆ పరిస్థితి చూసి బాధపడ్డాను.. దేవుడా సక్సెస్ ఇవ్వుమని కోరుకొన్నా.. మిస్టర్ మజ్ను వేడుకలో ఎన్టీఆర్
అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మిస్టర్ మజ్ను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే నాగార్జున, అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత భోగవల్లి ప్రసాద్, ఎస్ఎస్ తమన్ కూడా వేదికను అలంకరించారు. ఈ సందర్బంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..

గెస్ట్‌గా కాదు.. కుటుంబ సభ్యుడిగా
ముందుగా అభిమాన సోదరులందరికీ, పాత్రికేయులందరికీ, సినీ పెద్దలందరికి ధన్యవాదాలు. ఇక్కడికి నేను గెస్ట్‌గా కాకుండా కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఇక్కడ ఉన్నవాళ్లలంతా నాకు బాగా కావాల్సిన వారు. అందులో భోగవల్లి ప్రసాద్ గారు ఒకరు. సినిమా తీయాలంటే వ్యామోహంతోపాటు. వ్యాపారం తెలిసి ఉండాలి. ఎలా తీయాలి? ఎలా మార్కెట్ చేసుకోవాలి అని తెలియాలి. వ్యామోహం ఉంటే సినిమాను ఎంత బాగాతీయాలని తెలుస్తుంది.

వ్యాపారం తెలియదు.. అంతా వ్యామోహమే
నిర్మాత ప్రసాద్ గారికి వ్యాపారం తెలియదు. ఒక వ్యామోహం మాత్రమే తెలుసు. ఆయన నిర్మించిన రెండు సినిమాల్లో నేను నటించాను. అందులో ఒకటి ఊసరవెల్లి. నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో సినిమా నా హృదయానికి దగ్గరగా ఉన్న చిత్రం. డబ్బు ఎక్కువవుతుందంటే.. నాకు సినిమా బాగా రావాలని అంటాడు అని ఎన్టీఆర్ అన్నారు.

వెంకీపై అనుమానం ఏర్పడింది
సినిమా పరిశ్రమకు వచ్చిన రోజుల్లో నాకు ఉన్న అతికొద్ది మంది స్నేహితుల్లో వెంకీ అట్లూరి. తొలుత యాక్టర్‌గా పరిచయం. ఆ తర్వాత రైటర్‌గా పరిచయం అయ్యాడు. వెనువెంటనే డైరెక్టర్ అవుతున్నాడంటే కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. దర్శకుడిగా తొలిప్రేమను తీస్తుంటే ఏం తీస్తాడనే అనుమానం కలిగింది. కానీ సినిమా చూసిన తర్వాత వెంకీపై ఎంతో ప్రేమ పెరిగింది. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ వెంకీ. తొలిప్రేమ తర్వాత వెంకీ వెనుకకు చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. మళ్లీ మజ్ను ప్రేమకథతో ముందుకొస్తున్నాడు. నిజంగా హిట్ అవుతుందని నమ్ముతున్నాను అని ఎన్టీఆర్ అన్నాడు.

ఎస్ఎస్ తమన్‌కు సక్సెస్ లేకపోతే
తమన్ నాకు బృందావనం సినిమాకంటే ముందు నుంచి పరిచయం. ఓ దశలో సక్సెస్ లేక పతనం అవుతున్నాడనే బాధ ఉండేది. దేవుడా తమన్‌కు ఓ అవకాశం ఇవ్వాలని కోరుకొన్నాను. అది తొలిప్రేమ రూపంలో వచ్చింది. ఆ తర్వాత అరవింద సమేతతో మరో అద్బుతాన్ని ఆవిష్కరించాడు అని ఎన్టీఆర్ అన్నాడు.

అఖిల్‌లో గొప్ప క్వాలిటీ అదే
నా తమ్ముడు అఖిల్ గురించి గొప్ప క్వాలిటీ చెప్పాలి. ఆత్మ విమర్శ చేసుకొనే లక్షణం నాకు అఖిల్‌లో బాగా నచ్చుతుంది. ప్రతీసారి ఆత్మ విమర్శ తీసుకోవడం చూస్తే రానున్న రోజుల్లో గొప్ప నటుడు అవుతాడు. ఆ రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఆ రోజు ఎంతో దూరం లేదు. మజ్నుతో తెలిసిపోతుంది. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ ఘనమైన విజయం లభించాలని కోరుకొంటున్నాను అని తారక్ అన్నారు.


Click it and Unblock the Notifications











