Jr NTR: నాగవంశీని కొట్టుకోండి.. తిట్టుకోండి.. నాకేం తెలియదు.. జూ ఎన్టీఆర్
బ్లాక్ బస్టర్ చిత్రం మ్యాడ్‌కు సీక్వెల్‌గా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. యువ హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లుగా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పించారు.
భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. మార్చి 28న తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకొన్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ వేడుక యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..

అభిమాన సోదరులందరికీ నమస్కారం. మిమ్మల్ని ఇలా కలిసి చాలాకాలం అయిపోయింది. ఈ రోజు నిర్మాత నాగవంశీ పుణ్యాన మనం ఇలా కలుసుకోగలిగాం. మ్యాడ్ స్క్వేర్ సినిమా విజయం సాధించినందుకు, ఈ సినిమాలో భాగమైన ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు. నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. మనకు ఎన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి వచ్చి మనల్ని నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటకు వెళ్ళిపోదాం కదా అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకు దొరికాడు ఇక్కడ. మ్యాడ్ 2 తో ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ కి కంగ్రాచులేషన్స్ అని అన్నారు.
ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్‌గా అంతకంటే గొప్పగా ప్రేక్షకులను రంజింపజేయడం చాలా కష్టం. కానీ కళ్యాణ్ అది సాధించగలిగాడు. ఎందుకంటే ఆయనది స్వచ్ఛమైన హృదయం. మీ గుండె ఆ స్వచ్ఛతను ఎప్పటికీ కోల్పోవద్దు. నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన గొప్ప గుణం అది. చాలా ప్యూర్ గా కథను రాయగలగాలి. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని, మీ కెరీర్ లో అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కంగ్రాట్స్ అని నాగవంశీ అన్నారు.
అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని, వీళ్ళందరి వెనుక ఆ కనబడని శక్తే మా నాగవంశీ. సినిమా అంటే చాలా ప్యాషన్ తనకి. మాట కఠినంగా ఉంటుంది కానీ, మనసు చాలా మంచిది. ఆ మంచితనమే తనని కాపాడుతుంది. వంశీతో త్వరలో ఒక సినిమా చేయబోతున్నాను. మా చినబాబు గారి చిన్నితల్లి హారిక నిర్మాతగా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మ్యాడ్ టీం అందరికీ కంగ్రాట్స్. ఈ జన్మ అభిమానులకు అంకితం అని నాన్నగారితో చెప్పాను. మిమ్మల్ని ఆనందపరిచే సినిమాలు చేస్తూ ఉంటాను అని అన్నారు.
నాగవంశీ బ్యానర్‌లో ఒక సినిమా చేయబోతున్నాం. సరైన సమయంలో అధికారికంగా వెల్లడిస్తాం. నాగవంశీ నిర్మాతగా ఆ సినిమా మొదలుపెట్టిన రోజు అన్ని విషయాలు ఆయనకే అప్పగిస్తాను. ఏం అడగాలన్నా.. ఆయనను తిట్టాలన్నా, కొట్టాలన్న నాగవంశీనే. నేను మీకు ఆయనను వదిలిపెడుతాను అని ఎన్టీఆర్ ఫన్నీగా మాట్లాడారు.


Click it and Unblock the Notifications











