Devara Budget: వీఎఫ్ఎక్స్‌కే అన్ని కోట్లు.. ఎన్టీఆర్ కెరీర్‌లో మరో రికార్డు
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది బడా హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే పాన్ ఇండియా స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. RRR మూవీతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అతడు.. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తన 30వ చిత్రంగా 'దేవర'ను చేస్తున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమానే 'దేవర'. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చిలోనే ప్రారంభించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన పలు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే మరో దాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు తాజాగా తెలిసింది. దీనికోసం ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఇలా షూట్‌ను నవంబర్ వరకూ పూర్తి చేయబోతున్నారు.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో తెరకెక్కిస్తోన్నారు. ఇందుకోసం విదేశాలకు చెందిన స్టంట్ కొరియోగ్రాఫర్లను తీసుకు వచ్చారు. అదే సమయంలో వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఈ చిత్రంలో మేజర్ పార్ట్ కాబోతుందని తెలిసింది. అందుకే దీనికోసం కూడా ఓ ఇంటర్నేషనల్ కంపెనీతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీ బడ్జెట్‌పై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఈ సినిమా మొత్తంగా రూ. 300 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కుతోందట. అందులో వీఎఫ్ఎక్స్ కోసమే దాదాపుగా రూ. 140 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే సోలో హీరోగా చేసిన చిత్రాల్లో అత్యధిక మొత్తం అని అంటున్నారు. ఇలా యంగ్ టైగర్ మరో రికార్డు కొట్టాడు.
ఇక.. జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











