ప్రభాస్‌కు ఎన్టీఆర్ విలువైన సలహా.. యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ ఖాయం.!

By Manoj Kumar P

గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య సత్సంబంధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకరి సినిమా ఫంక్షన్లకు ఒకరు హాజరు కావడం.. సినిమాలు బాగుంటే అభినందించడం.. ప్రమోషన్ కోసం సాయం చేయడం వంటి వాటి వల్ల హీరోలతో పాటు వారి ఫ్యాన్స్ మధ్య స్నేహ సంబంధాలు పెరిగిపోతున్నాయి.

మరీ ముఖ్యంగా మల్టీస్టారర్ మూవీస్ వస్తున్న నేపథ్యంలో ఇవి ఇంకా బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న ప్రభాస్‌కు ఎన్టీఆర్‌ ఓ విలువైన సలహా ఇచ్చాడని ఓ వార్త తాజాగా బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త? పూర్తి వివరాల్లోకి వెళితే...

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు

జూనియర్ ఎన్టీఆర్ కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఒకానొక సమయంలో ఫ్లాపుల పరంపర కొనసాగుతున్నప్పుడు పూరీ జగన్నాథ్‌తో తీసిన ‘టెంపర్'తో అతడు హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి తారక్ వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి వచ్చిన ప్రతి సినిమా హిట్ అవుతుండడంతో అతడి మార్కెట్ కూడా గణనీయంగా పెరిగిపోయింది.

భారీ సినిమాలో భాగం అయిన తారక్

భారీ సినిమాలో భాగం అయిన తారక్

తారక్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR'లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో అతడు కొమరం భీంగా కనిపించబోతున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో తారక్ సరసన లండన్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో ఆలియా భట్, సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్ సహా ఎంతో మంది నటిస్తున్నారు.

ఆయనతో ప్రత్యేకంగా పని చేశాడు

ఆయనతో ప్రత్యేకంగా పని చేశాడు

ఈ సినిమాలో తన లుక్ కోసం తారక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ‘అరవింద సమేత' సినిమా సమయంలో తన ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేసిన లాయిడ్‌ స్టీవెన్‌తో కలిసి పని చేశాడు. కొద్దిరోజులుగా ఆయన పర్యవేక్షణలో ఈ నందమూరి హీరో ఎన్నో కసరత్తులు చేస్తున్నాడు. ఈ విషయాన్ని లాయిడ్ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

ప్రభాస్‌కు ఎన్టీఆర్ విలువైన సలహా

ప్రభాస్‌కు ఎన్టీఆర్ విలువైన సలహా

‘బాహుబలి', ‘సాహో' సినిమాలతో వరల్డ్ ఫేమస్ అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ మధ్య అతడు బాగా వొళ్లు చేశాడు. దీంతో సరైన ఫిట్‌నెస్ ట్రైనర్ కోసం వెదుకుతున్న సమయంలో.. తారక్ అతడికి ఓ సలహా ఇచ్చాడట. తనకు ట్రైనర్‌గా పని చేస్తున్న లాయిడ్‌ స్టీవెన్‌ అయితే మంచిగా ఉంటుందని ప్రభాస్‌కు సూచించాడని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది.

యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ ఖాయం.!

యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ ఖాయం.!

ఈ మధ్య విడుదలైన ‘మత్తు వదలరా' టీమ్‌ను ప్రశంసించేందుకు వచ్చిన ప్రభాస్‌ను చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ ఫొటోల్లో అతడు ఎంతో స్లిమ్‌గా కనిపించడమే దీనికి కారణం. ఇటీవల కొద్ది రోజులుగా ప్రభాస్.. లాయిడ్ సమక్షంలో శ్రమిస్తున్నాడట. అందుకే ఈ లుక్‌లోకి వచ్చాడని ప్రచారం జరుగుతోంది. అంటే అతడి ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

దాని కోసమే ప్రభాస్ ఇలా చేస్తున్నాడా.?

దాని కోసమే ప్రభాస్ ఇలా చేస్తున్నాడా.?

ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్' (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా 1960 దశకానికి చెందిన ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో యంగ్ రెబెల్ స్టార్ రొమాంటిక్ లవర్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం ప్రస్తుతం అతడు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X