ఆ సమయంలో బాగా లావయ్యా, కారణం ఇదే.. ఉద్వేగభరితంగా ఎన్టీఆర్!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయిన ఈ మాయ పేరేమిటో చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరిగింది. రాహుల్ విజయ్, కావ్య ఈ చిత్రంలో జంటగా నటించారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్ తన కుమారుడు రాహుల్ విజయ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ ప్రేమ కథగా ఈ మాయ పేరేమిటో చిత్రం తెరకెక్కుతోంది. ఈ వేడుకకు దర్శకులు పూరి జగన్నాథ్ కూడా మరో అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎమోషన్ల స్పీచ్ ఆకట్టుకుంది.

ఎమోషనల్‌గా ఎన్టీఆర్
ఫైట్ మాస్టర్ విజయ్ గురించి ఎన్టీఆర్ ఎమోషనల్ గా ప్రసంగించారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజి వలన ఫైట్ మాస్టర్స్ కూడా సేఫ్టీ పెరిగింది. కానీ ఎలాంటి సేఫ్టీ లేని రోజుల్లోనే చాలా కష్టపడి విజయ్ ఫైట్ మాస్టర్ గా ఎదిగారని ఎన్టీఆర్ తెలిపారు. ఆయన నేను నటించిన చాలా చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా పనిచేశారు.

ఫైట్ మాస్టర్ దంపతులపై
అదే సమయంలో విజయ్, సుమతి దంపతులపై ఎన్టీఆర్ జోకులు పేల్చాడు. విజయ్ కష్టపడి ఎదుగుతున్న రోజుల్లో ఆయన భార్య సుమతిగారే అండగా నిలిచారని తెలిపాడు. విజయ్ పెద్ద అందగాడేం కాదు. కానీ వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు అంటూ జోకులు వేశాడు.

ఇన్సిపిరేషన్ అవసరం లేదు
హీరో రాహుల్ విజయ్ తొలి చిత్రం సందర్భంగా అతడికి ఎన్టీఆర్ సూచనలు ఇచ్చాడు. ఇండస్ట్రీలో హీరోగా ఎదగాలన్నా, డాన్సర్ గా ఎదగాలన్నా ఇన్సిపిరేషన్ ఎవరూ అవసరం లేదు. మన తల్లిందండ్రులే మనకు ఆదర్శం అని ఎన్టీఆర్ తెలిపాడు.

అద్భుతమైన టీం
రాహుల్ విజయ్ తొలి చిత్రానికి అద్భుతమైన టెక్నీషియన్స్ పనిచేస్తున్నారని ఎన్టీఆర్ తెలిపాడు. ఈ చిత్రానికి సంగీతం అందించిన స్వరబ్రహ్మ మణిశర్మని ఎన్టీఆర్ ప్రశంసించాడు.

లావయ్యింది అందుకే
గతంలో తాను చాలా లావుగా ఉండేవాడిని అనే విషయం అందరికి తెలిసిందే అని ఎన్టీఆర్ తెలిపాడు. దానికి గల కారణాన్ని ఎన్టీఆర్ చాలా సరదాగా తెలిపాడు. బాగా తినేవాడిని అందుకే లావయ్యా. సినిమా షూటింగ్ ఉంటె ప్రతి రోజు సుమతిగారు బాగా వండి విజయ్ తో భోజనం పంపేవారు. నేను లావయ్యానంటే అందులో ఆమె పుణ్యం కూడా ఉంది ఎన్టీఆర్ సరదాగా తెలిపాడు.


Click it and Unblock the Notifications











